రోహిత్ శర్మ చెత్త రికార్డు | Rohit Sharma Creates Unwanted Record With Failure In 5th ODI vs New Zealand | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మ చెత్త రికార్డు

Nov 15 2026 8:51 AM | Updated on Nov 15 2026 8:51 AM

Rohit Sharma Creates Unwanted Record With Failure In 5th ODI vs New Zealand

source: X

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్‌ వన్డే సిరీస్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్.. కివీస్‌ సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు వన్డేల సిరీస్‌లో నాలుగుసార్లు బ్యాటింగ్‌కు దిగిన అతడు కేవలం 30 పరుగులే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.

తాజాగా రోహిత్‌ ఐదో వన్డేలోనూ స్వల్ప స్కోర్‌కే (7) వెనుదిరిగాడు. తద్వారా కెరీర్‌లో ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో అత్యల్ప పరుగులు (30) నమోదు చేశాడు. కనీసం మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను పరిశీలిస్తే.. కెరీర్‌లో మూడో అత్యల్ప పరుగుల సంఖ్యను నమోదు చేశాడు.

ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో రోహిత్ అత్యల్ప స్కోర్లు
శ్రీలంక (శ్రీలంకలో)- 13 పరుగులు (2012)
వెస్టిండీస్ (వెస్టిండీస్‌లో)- 15 పరుగులు (2009)
న్యూజిలాండ్ (న్యూజిలాండ్‌లో)- 30 పరుగులు (2026)
శ్రీలంక (శ్రీలంకలో)- 44 పరుగులు (2009)

మ్యాచ్‌ విషయానికొస్తే.. మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.  రోహిత్‌ (7) సహా విరాట్‌ కోహ్లి (5), రుతురాజ్‌ గైక్వాడ్‌ (18) విఫలమయ్యారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (17), అక్షర్‌ పటేల్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 68-3గా ఉంది. ఫిషర్‌ 2, డఫీ ఓ వికెట్‌ పడగొట్టారు.  

ఇదీ చదవండి: ఆసియా కప్‌ హీరోకు బంపరాఫర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement