ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌పై శతక్కొట్టిన పాక్‌ బ్యాటర్‌ | Who Is Usman Khan, Pakistani Batter Who Smashed Big Hundred Vs India In U19 Asia Cup Final 2026 | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌పై శతక్కొట్టిన పాక్‌ బ్యాటర్‌

Nov 14 2026 1:34 PM | Updated on Nov 14 2026 1:56 PM

Who Is Usman Khan, Pakistani Batter Who Smashed Big Hundred Vs India In U19 Asia Cup Final 2026

source: X

భారత్‌తో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాక్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసఫ్‌ (62 నాటౌట్‌) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాక్‌ అతి భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది.

44.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 299-4గా ఉంది. యూసఫ్‌తో పాటు హమ్జా జహూర్‌ క్రీజ్‌లో ఉన్నాడు. మిగతా పాక్‌ బ్యాటర్లలో హయమ్‌ ఖాన్‌ 21, అహ్మద్‌ హుసేన్‌ 17 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కావ్య పటేల్‌ 2 వికెట్లు తీయగా.. చిగురుపాటి వెంకట్‌, అర్జున్‌ రాజ్‌పుత్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఎవరీ ఉస్మాన్ ఖాన్..? 
ఈ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో కదంతొక్కిన ఉస్మాన్‌ ఖాన్‌, 2008లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు పాకిస్తాన్ అండర్-19 జట్టులో కీలక ఆటగాడు.

ఇప్పటివరకు పాక్‌ తరఫున మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, ఒక యూత్‌ టెస్ట్, 26 యూత్ వన్డేలు ఆడాడు. యూత్ వన్డేల్లో అతడి ప్రదర్శన ప్రత్యేకంగా నిలుస్తోంది. 51.65 సగటుతో 1,188 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 151. ఈ ఫార్మాట్‌లో నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

ఇదీ చదవండి: కెప్టెన్సీ డెబ్యూలో వైభవ్‌ విఫలం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement