source: X
భారత్ టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కొంతకాలంగా ఖాళీగా ఉన్న స్కై.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా మైదానంలోకి తిరిగి అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్కై.. హైదరాబాద్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 15 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేశాడు.ఓవరాల్‌గా 21 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులతో అజేయంగా నిలిచి, శివమ్ దూబే (13 నాటౌట్) సహకారంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముంబై గెలుపుతో స్కైతో పాటు ముషీర్ ఖాన్ (24 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. అంగ్‌కృష్ రఘువంశీ (27), హార్దిక్ తామోర్ (22) తమవంతు బాధ్యతలు నిర్వర్తించారు.
ముంబై బ్యాటర్లు కలిసికట్టుగా రాణించడంతో హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ముంబై 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హైదారాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 2, ప్రణవ్ వర్మ ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ 3, శివమ్ దూబే, సాయిరాజ్ పాటిల్ తలో 2, శార్దూల్ ఠాకూర్, అథర్వ అంకోలేకర్ చెరో వికెట్ పడగొట్టి, హైదరాబాద్‌కు దెబ్బేశారు. హైదరాబాద్ బ్యాటర్లలో అభిరథ్ రెడ్డి (35) టాప్ స్కోరర్ కాగా.. కొడిమెల హిమతేజ (25), కెప్టెన్ చామ మిలింద్ (22) 20కి పైగా స్కోర్ చేశారు.
ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాలో కీలక మార్పు


