భారత్‌ X పాకిస్తాన్‌ | Under 19 Asia Cup Final Today | Sakshi
Sakshi News home page

భారత్‌ X పాకిస్తాన్‌

Nov 14 2026 4:33 AM | Updated on Nov 14 2026 4:33 AM

Under 19 Asia Cup Final Today

నేడు అండర్‌–19 ఆసియా కప్‌ ఫైనల్‌

ఉదయం గం. 10:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌–1,3,4 చానెల్స్‌లో, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

అల్‌ అమీరట్‌ (ఒమన్‌): ఆసియా కప్‌ అండర్‌–19 వన్డే క్రికెట్‌ టోర్నీలో యువ భారత్‌ టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే తుదిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో లక్ష్య రాయ్‌చందాని సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో పరాజయం మూటగట్టుకున్న యువభారత్‌... ఇప్పుడు బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీని 12 సార్లు నిర్వహించగా... అందులో 8సార్లు భారత్‌ విజేతగా నిలిచింది. 

సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌పై మన జట్టు ఘనవిజయం సాధించగా... బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి పాకిస్తాన్‌ ముందంజ వేసింది. బలాబలాల దృష్ట్యా ఇరుజట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో 101 సగటుతో 303 పరుగులు చేసిన ఆర్యవీర్‌ సెహ్వాగ్‌పై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌ బాటలో విధ్వంసక ఆటతీరుతో జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తున్న ఆర్యవీర్‌ మరోసారి సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

కెప్టెన్‌ లక్ష్య రాయ్‌చందాని, వీకే వినీత్, రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌తో మన బ్యాటింగ్‌ బలంగా ఉంది. బౌలింగ్‌లో ఇషాన్‌ సూద్‌ కీలకం కానున్నాడు. వీరంతా కలిసికట్టుగా కదంతొక్కితే యంగ్‌ఇండియా ఖాతాలో తొమ్మిదో టైటిల్‌ చేరడం పెద్ద కష్టమేం కాదు. ఫర్హాన్‌ యూసుఫ్‌ సారథ్యంలో పాక్‌ జట్టు ఈ టోర్నీలో ఓటమి లేకుండా ఫైనల్‌కు అర్హత సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement