శ్రేయస్‌ అయ్యర్‌ చెత్త రికార్డు | Shreyas Iyers Name Added To Unwanted List Alongside Virat Kohli, Shubman Gill | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ అయ్యర్‌ చెత్త రికార్డు

Nov 13 2026 9:30 PM | Updated on Nov 13 2026 9:33 PM

Shreyas Iyers Name Added To Unwanted List Alongside Virat Kohli, Shubman Gill

మౌంట్ మౌంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా, పేసర్ మాట్ హెన్రీ దాటికి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది.

ఈ పరాజయంతో భారత తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన పేరిట ఓచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.  తొలి టీ20, తొలి వన్డే మ్యాచ్‌లు రెండింటిలోనూ ఓటమి చవిచూసిన మూడో భారత కెప్టెన్‌గా శ్రేయస్‌ నిలిచాడు. కాగా టెస్టు సిరీస్ సన్నాహకాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.

ఈ క్రమంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. అయితే, కెప్టెన్‌గా వన్డే అరంగేట్రంలోనే అతడికి నిరాశ ఎదురైంది. అంతకుముందు టీ20 కెప్టెన్‌గానూ శ్రేయస్ తన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాడు. ఈ జాబితాలో అయ్యర్ కంటే ముందు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
చదవండి: "ఇది చాలా అన్యాయం.. అతడిని టూర్ కోసం​ న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారా?"
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement