టీమిండియాతో మ్యాచ్‌.. న్యూజిలాండ్‌ బౌలర్‌ ప్రపంచ రికార్డు | Matt Henry Creates History With World Record First Over VS India | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియాతో మ్యాచ్‌.. న్యూజిలాండ్‌ బౌలర్‌ ప్రపంచ రికార్డు

Nov 13 2026 4:16 PM | Updated on Nov 13 2026 4:20 PM

Matt Henry Creates History With World Record First Over VS India

బే ఓవ‌ల్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన నాలుగో వ‌న్డేలో న్యూజిలాండ్ పేస‌ర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగాడు. త‌న అద్భుత బౌలింగ్‌తో భార‌త టాపార్డ‌ర్‌ను అత‌డు కకావికలం చేశాడు. తొలి ఓవ‌ర్‌లోనే స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌ను ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియన్‌కు పంపాడు.

ఆ త‌ర్వాత ఇషాన్ కిష‌న్‌, గుర్నూర్ బ్రార్‌, కుల్దీప్ యాద‌వ్‌ల‌ను సైతం అత‌డు బోల్తా కొట్టించాడు. ఈ కివీస్ వెట‌ర‌న్ పేస‌ర్ మొత్తంగా 9.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 27 ప‌రుగులిచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అత‌డి సంచ‌ల‌న బౌలింగ్ ఫ‌లితంగా భార‌త్‌ 334 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో కేవ‌లం 89 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కాగా ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో స‌త్తాచాటిన హెన్రీ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

హెన్రీ సాధించిన రికార్డులు ఇవే

👉55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా మ్యాట్ హెన్రీ నిలిచాడు. అయితే భార‌త్‌పై ఈ ఫీట్ సాధించిన తొలి బౌల‌ర్‌గా హెన్రీ ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు. కాగా వన్డే చరిత్రలో ఒక్క పరుగు కూడా చేయకుండానే భారత్ తన మొదటి మూడు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.

👉భారత్‌పై న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా హెన్రీ (6/27) నిలిచాడు. ఈ జాబితాలో షేన్ బాండ్ (6/19 - 2005లో) అగ్రస్థానంలో ఉన్నాడు.

👉హెన్రీకి కూడా తన వన్డే కెరీర్‌లో ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం.

👉వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన జాబితాలో హెన్రీ(4).. షేన్ బాండ్‌తో కలిసి మూడో స్ధానంలో నిలిచాడు. వీరికంటే ట్రెంట్ బౌల్ట్ (6), సర్ రిచర్డ్ హ్యాడ్లీ (5) ముందున్నారు.

👉భారత్‌పై హెన్రీకి ఇది రెండో ఐదు వికెట్ల ప్రదర్శన. తద్వారా ఒకే జట్టుపై అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన కివీస్ బౌలర్ల జాబితాలో ట్రెంట్ బౌల్ట్ (ఆస్ట్రేలియాపై 2), బెన్ సియర్స్ (పాకిస్తాన్‌ 2) సరసన హెన్రీ నిలిచాడు. షేన్ బాండ్ (ఆస్ట్రేలియాపై 3) అగ్రస్థానంలో ఉన్నాడు.

👉అదేవిధంగా వన్డేల్లో భారత్‌పై అత్యధికసార్లు 4 వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా  రవి రాంపాల్, అజంత మెండిస్ వంటి దిగ్గజాల సరసన హెన్రీ నిలిచాడు.

వన్డేల్లో భారత్‌పై అత్యధికసార్లు 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు
4 - మ్యాట్ హెన్రీ (12 ఇన్నింగ్స్‌లు)
4 - రవి రాంపాల్ (14 ఇన్నింగ్స్‌లు)
4 - అజంత మెండిస్ (19 ఇన్నింగ్స్‌లు)
4 - బ్రెట్ లీ (30 ఇన్నింగ్స్‌లు)
4 - ఆకిబ్ జావేద్ (36 ఇన్నింగ్స్‌లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement