అసలు ఊహించలేదు.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్‌ | Shreyas Iyer Lists Reasons For Indias Embarrassing Loss In Mount Maunganui ODI vs NZ | Sakshi
Sakshi News home page

అసలు ఊహించలేదు.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్‌

Nov 13 2026 3:15 PM | Updated on Nov 13 2026 3:25 PM

Shreyas Iyer Lists Reasons For Indias Embarrassing Loss In Mount Maunganui ODI vs NZ

PC: bcci

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. శుక్ర‌వారం బే ఓవల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో వ‌న్డేలో కివీస్ చేతిలో 244 పరుగుల భారీ తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది. 334 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో టీమిడియా కేవ‌లం 89 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కివీస్ పేస‌ర్ మాట్ హెన్రీ 6 వికెట్లు ప‌డ‌గొట్టి మెన్ ఇన్ బ్లూ ప‌త‌నాన్ని శాసించాడు. 

అత‌డితో పాటు మాథ్యూ ఫిష‌ర్ మూడు వికెట్లు సాధించాడు. భార‌త ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌(27), అక్షర్‌ పటేల్‌(21), నమన్‌ ధీర్‌(21) మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పం‍దించాడు. 

సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా మారిందని అయ్యర్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన హెన్రీపై శ్రేయస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. అయితే తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్వభావం పూర్తిగా మారిపోయింది. ఏదేమైనప్పటికి మాట్ హెన్రీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తొలి బంతి నుంచే సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లు అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. కానీ వారు అద్భుతంగా ఆడారు.

ప్రత్యర్థి జట్టు 330 పరుగులు చేయడంతో ఈ పిచ్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉందని మేము భావించాము. ఈ ఫీల్డింగ్‌లో మేము కొన్ని మ్యాచ్‌లు జారివిడిచాం. అవి కూడా కొంత వరకు ప్రభావం చూపాయి. కానీ ఆటలో అవన్నీ సహజం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తామని అనుకున్నాం. 

కానీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారం‍భయ్యాక అసలు కథ ఆర్ధమైంది. బంతి అసాధారణంగా లోపలికి, బయటికి సీమ్ అవ్వడంతో బ్యాటర్లకు ఏ షాట్ ఆడాలో స్పష్టత లేకపోయింది. మా జట్టులో  ఎవరూ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోలేదని, అందరూ అత్యుత్తమ బంతులకే వెనుదిరిగారు. 

ఈ ఓటమిని తర్వగా మర్చిపోవడం చాలా ముఖ్యం.  బ్యాటింగ్  బౌలింగ్ విభాగాల్లో ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకుంటాం. మేము ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచాం. మరో మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకునేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" అయ్యర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య ఐదో వన్డే ఆదివారం ఇదే వేదికలో జరిగింది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ప్లేయర్‌.. 38 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement