చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ప్లేయర్‌.. 38 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌ | All Records Mahli Beardman Broke During Australia vs England 1st ODI | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ప్లేయర్‌.. 38 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌

Nov 13 2026 2:47 PM | Updated on Nov 13 2026 2:57 PM

All Records Mahli Beardman Broke During Australia vs England 1st ODI

ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ మహీ బీర్డ్‌మన్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేతో అరంగేట్రం చేసిన బీర్డ్‌మన్.. తన అద్బుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 

ఈ మ్యాచ్‌లో  మొత్తం 7.4 ఓవర్లు బౌలింగ్ చేసిన బీర్డ్‌మన్.. ఒక మెయిడిన్‌తో కేవలం 24 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.  జో రూట్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, హ్యారీ బ్రూక్ వంటి కీలక ఆటగాళ్లను అతడే పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో 21 ఏళ్ల బీర్డ్‌మన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

బీర్డ్‌మన్ సాధించిన రికార్డులు ఇవే
వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా బీర్డ్‌మన్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్‌ మాజీ బౌలర్ టోనీ డోడెమైడ్ పేరిట ఉండేది. 1988లో గబ్బా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టోనీ డోడెమైడ్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు.

తాజా మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన బీర్డ్‌మన్.. డోడెమైడ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాకుండా వన్డే అరంగేట్రంలోనే 6 వికెట్లు తీసిన మొట్టమొదటి ఆస్ట్రేలియా బౌలర్ కూడా బీర్డ్‌మన్ కావడం గమనార్హం.

ఓవరాల్‌గా వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో బీర్డ్‌మన్ (6/24) మూడో స్ధానంలో నిలిచాడు. కగిసో రబాడ (6/16), ఫిడెల్ ఎడ్వర్డ్స్ (6/22) మాత్రమే అతనికంటే ముందున్నారు.

ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా బీర్డ్‌మన్ నిలిచాడు. అతడు కేవలం  21 ఏళ్ల 74 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు.   ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రంలో 5 వికెట్లు తీసిన పిన్న వయస్కుల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్నాడు.

ఆస్ట్రేలియా తరఫున వన్డే చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ల జాబితాలో గ్లెన్ మెక్‌గ్రాత్ (7/15), ఆండీ బికెల్ (7/20), గ్యారీ గిల్మోర్ (6/14) తర్వాత బీర్డ్‌మన్ 4వ స్థానంలో నిలిచాడు.

వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (ప్రపంచవ్యాప్తంగా)

6/16 - కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) వర్సెస్‌ బంగ్లాదేశ్, మీర్పూర్ (2015)

6/22 - ఫిడెల్ ఎడ్వర్డ్స్ (వెస్టిండీస్) వర్సెస్‌ జింబాబ్వే, హరారే (2003)

6/24 - మహీ బీర్డ్‌మన్ (ఆస్ట్రేలియా) వర్సెస్‌ ఇంగ్లాండ్, పెర్త్ (2026)

ఆస్ట్రేలియా తరఫున వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ ప్రదర్శనలు

6/24 - మహీ బీర్డ్‌మన్ వర్సెస్‌ ఇంగ్లాండ్, పెర్త్ (2026)

5/21 - టోనీ డోడెమైడ్ వర్సెస్‌ శ్రీలంక, పెర్త్ (1988)

4/17 - జేవియర్ బార్ట్‌లెట్ వర్సెస్‌ వెస్టిండీస్, మెల్‌బోర్న్ (2024)

4/19 - స్టువర్ట్ మాక్‌గిల్ వర్సెస్‌ పాకిస్థాన్, సిడ్నీ (2000)

ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (ఆల్-టైమ్):

7/15 - గ్లెన్ మెక్‌గ్రాత్ వర్సెస్‌ నమీబియా (2003)

7/20 - ఆండీ బికెల్ వర్సెస్‌ ఇంగ్లాండ్ (2003)

6/14 - గ్యారీ గిల్మోర్ వర్సెస్‌ ఇంగ్లాండ్ (1975)

6/24 - మహీ బీర్డ్‌మన్ వర్సెస్‌ ఇంగ్లాండ్ (2026)

6/28 - మిచెల్ స్టార్క్ వర్సెస్‌ న్యూజిలాండ్ (2015)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement