ఆసీస్ బౌల‌ర్ల విజృంభ‌ణ‌.. 131 రన్స్‌కే చాప చుట్టిన ఇంగ్లండ్‌ | AUS Bowler Beardman-6 Wickets-ENG 131 Runs Allout-1st ODI-Perth | Sakshi
Sakshi News home page

ఆసీస్ బౌల‌ర్ల విజృంభ‌ణ‌.. 131 రన్స్‌కే చాప చుట్టిన ఇంగ్లండ్‌

Nov 13 2026 12:02 PM | Updated on Nov 13 2026 12:10 PM

AUS Bowler Beardman-6 Wickets-ENG 131 Runs Allout-1st ODI-Perth

Photo Credit: Twitter

సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా బౌల‌ర్లు విజృంభించారు. డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న మ‌హి బియ‌ర్డ్‌మ‌న్ ఆరు వికెట్లతో చెల‌రేగ‌డంతో ఇంగ్లండ్ 33.4 ఓవ‌ర్ల‌లో 131 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బియ‌ర్డ్‌మ‌న్‌కు తోడుగా స్పెన్స‌ర్ జాన్స‌న్ మూడు వికెట్లు, గ్జేవియ‌ర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. 

ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో టెయిలెండ‌ర్ గ‌స్ అకిన్‌స‌న్ (29 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, టామ్ బాంట‌న్ (25), విల్ జాక్స్ (25) ప‌ర్వాలేద‌నిపించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఓవ‌ర్ నుంచి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. 

డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న‌ప్ప‌టికీ, ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా బౌలింగ్ చేసిన బియ‌ర్డ్‌మ‌న్ ధాటికి ఇంగ్లండ్ లైన‌ప్ కుదేల‌య్యింది. జో రూట్‌, కెప్టెన్ బ్రూక్‌, జోర్డాన్ కాక్స్‌, సామ‌క్ క‌ర‌న్‌ల‌తో కూడిన బ్యాటింగ్ లైన‌ప్‌ను బియ‌ర్డ్‌మ‌న్ కకావికలం చేశాడు.

ఇదీ చదవండి: శ‌త‌కంతో కివీస్ ఓపెన‌ర్‌ విధ్వంసం.. భార‌త్ ముంగిట భారీ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement