Photo Credit: Twitter
మౌంట్ మాంగనూయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ అర్థశతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో సీఫెర్ట్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌తో వన్డే మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలోపు అర్థసెంచరీ బాదిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ నిలిచాడు.
39 బంతుల్లో అర్థశతకం మార్క్ సాధించిన సీఫెర్ట్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 1999లో భారత్‌తో జరిగిన వన్డేలో బ్రియాన్ యంగ్ (47 నాటౌట్) ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా టిమ్ సీఫెర్ట్ ఆ రికార్డును సవరించి తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు వన్డేల్లో సీఫెర్ట్‌కు ఇదే తొలి అర్థశతకం.
👉ఇక నేటి మ్యాచ్‌లో 10 ఓవర్లలో 72/0 పరుగులు చేయడం న్యూజిలాండ్‌కు హోమ్ గ్రౌండ్‌లో అత్యుత్తమంగా నిలిచింది. 1999లో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన వన్డేలో 73/2 ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది.
👉17 ఇన్నింగ్స్‌ల తర్వాత న్యూజిలాండ్ వన్డేల్లో తొలి పది ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ను దాటడం ఇదే. చివరిసారి 2025లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో 64 పరుగులు చేసింది.
ఇదీ చదవండి:


