విజేత తెలుగు బ్లాక్‌హాక్స్‌ | Telugu Black Hawks team won the title in the Prime Volleyball League | Sakshi
Sakshi News home page

విజేత తెలుగు బ్లాక్‌హాక్స్‌

Nov 13 2026 4:15 AM | Updated on Nov 13 2026 4:15 AM

  Telugu Black Hawks team won the title in the Prime Volleyball League

సాక్షి, విజయవాడ: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) ఐదో సీజన్‌ సన్నాహాల్లో భాగంగా కంకణాల స్పోర్ట్స్‌ గ్రూప్‌ (కేఎస్‌జీ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు స్వాగ్‌ ట్రోఫీలో తెలుగు బ్లాక్‌హాక్స్‌ జట్టు టైటిల్‌ సాధించింది. వీఆర్‌ సిద్ధార్థ యూనివర్సిటీలో జరిగిన ఫైనల్లో తెలుగు బ్లాక్‌హాక్స్‌ 5–0 సెట్‌ల తేడాతో బ్లాక్‌హాక్స్‌ అకాడమీ జట్టును ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌) వీసీ ఎండీ భరణి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా కేఎస్‌జీ చైర్మన్‌ కంకణాల అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని స్థానిక క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించడమే తెలుగు బ్లాక్‌హాక్స్‌ ప్రధాన లక్ష్యమని అన్నారు. 

‘గత ఆగస్టులో తెలుగు బ్లాక్‌హాక్స్‌ తరఫున యంగ్‌ టాలెంట్‌ హంట్‌ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ట్రయల్స్‌ ద్వారా సిరిల్‌ రెడ్డి (వరంగల్‌), విష్ణువర్ధన్‌ బాబు (యానం), నమిత్, మునీష్‌ వెంకటేశన్, దీపక్‌ ఐదుగురు పీవీఎల్‌ ఐదో సీజన్‌లో పాల్గొనే తెలుగు బ్లాక్‌హాక్స్‌ జట్టులో చోటు సంపాదించారు’ అని అభిషేక్‌ రెడ్డి చెప్పారు. బ్లాక్‌హాక్స్‌ జట్టులో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత అర్జెంటీనా జట్టు స్టార్‌ హెర్నాన్‌ ఫెడెరికో పెరేరా ప్రధాన ఆకర్షణ కానున్నాడు. పీవీఎల్‌ ఐదో సీజన్‌ ఈనెల 30 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement