సూపర్ కాంబో.. ఓకే మూవీలో ఇద్దరు స్టార్ కమెడియన్స్‌..! | Satya and Yogi Babu GOLDEN BHAGYAM Title Glimpse out now | Sakshi
Sakshi News home page

GOLDEN BHAGYAM Title Glimpse: సూపర్ కాంబో.. ఫుల్ కామెడీ గ్లింప్స్ చూశారా?

Sep 29 2026 12:45 PM | Updated on Sep 29 2026 12:50 PM

Satya and Yogi Babu GOLDEN BHAGYAM Title Glimpse out now

ఇద్దరు స్టార్ కమెడియన్స్ ఓకే సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఫుల్ ఫన్ మీల్స్ ఖాయమే. అలాంటి కాంబోనే ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రానుంది. ఈ మూవీలో కమెడియన్స్‌ సత్య, యోగిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై నాగార్జున రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, బాపిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గోల్డెన్ భాగ్యం అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్‌లో నవ్వులు పూయిస్తోంది. ఇది తెలుగు, తమిళ సినిమా కాదు.. తెలుమిళ్ సినిమా అంటూ యోగిబాబు చెప్పిన డైలాగ్ మస్తు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో కామెడీతో పాటు లవ్, క్రైమ్, యాక్షన్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి పవన్, నితీశ్ జాన్ సంగీతమందిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement