సోమవారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హడావుడి ఉంటుంది. కానీ ఈ వారం రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని సభ్యుల్ని విడగొట్టి.. డాగర్స్ సంపాదించుకోవడం, రథం టాస్క్ అని హౌస్‌మేట్స్ మధ్య బిగ్‌బాస్ పోటీ పెట్టాడు. మంగళవారం నామినేషన్లలో హడావుడి మొదలైంది. అయితే ఇందులో అంతా కలిసి త్రిగుణ్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)
తాజాగా రిలీజ్ చేసిన తొలి ప్రోమోలో చూస్తే అమన్.. త్రిగుణ్ పేరు చెప్పాడు. అరేయ్ తురేయ్ అని చాలా సార్లు అన్నావ్ అని అమన్ అంటే.. నువ్వు వద్దు అన్నాక ఒక్కసారి కూడా అనలేదని త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు. అంత వీడియో వచ్చినోడివి చూసినవ్ కదా నీకు కాన్ఫిడెన్స్ లేదా? అని త్రిగుణ్‌ని ఏదో మ్యాటర్‌తో కంపేర్ చేసి అమన్ అనగానే.. నాకు లేదు, నీ అంత లేదని త్రిగుణ్ సమాధానమిచ్చాడు. నీకు లేదు అని వెరైటీగా చిందులు వేస్తూ అమన్ వెక్కిరించాడు.
తర్వాత వచ్చిన త్రిగుణ్.. రోహిత్‌ని, నరేశ్.. అమన్‌ని నామినేట్ చేశారు. తమ కారణాలు చెప్పారు. ఇల్లు సరిగ్గా లేకపోతే అమన్ మొహాన్ని అనడం ఎందుకు? అతడ్ని తక్కువ చేసి మాట్లాడటం ఎందుకు అని రోహిత్ అన్నాడు. మరోవైపు ఇంట్లో పది గొడలుంటే అందులో నాలుగు అమన్‌వే ఉంటున్నాయ్ అని నరేశ్ చెప్పుకొచ్చాడు. నీ మొహం చూస్తుంటే చిరాకేస్తోంది. నిన్ను చూస్తుంటే చిరాకేస్తోంది అని అంటే అలాంటి మాటలు పడటానికి రాలేదు ఎవరిక్కడ అని అమన్ సీరియస్ అయ్యాడు. వెనకాలకు వెళ్లి లాంజ్‌లో కూర్చుని డాక్యుమెంట్లు రాసుకునే టైపు కాదు. ఫ్రంట్ ఫుట్‌లో వచ్చి బ్యాటింగ్ చేసేవాడ్ని అని త్రిగుణ్ అన్నాడు. ప్రోమో చూస్తుంటే ఫుల్ ఫైర్ కనిపించింది.
అయితే రెడ్, బ్లూ తమ జట్లలోని సభ్యుల్ని కాకుండా పక్క టీమ్‌లోని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ మెలిక పెట్టినట్లు ప్రోమో చూస్తుంటే అనిపించింది. అలానే ఎపిసోడ్‌లో ఇంకెన్ని గొడవలు అవుతాయోననే సందేహం కూడా కలుగుతోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అపూర్వ-షాలిని.. ఇలా తయారయ్యారేంటి?)


