బిగ్‌బాస్‌లో బిగ్‌ ట్విస్ట్.. రూ.15 లక్షల ఆఫర్‌ కొట్టేసిన కంటెస్టెంట్..! | Bigg Boss Season 10 Telugu weekend episode highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్‌లో బిగ్‌ ట్విస్ట్.. రూ.15 లక్షల ఆఫర్‌ కొట్టేసిన కంటెస్టెంట్..!

Sep 27 2026 7:32 AM | Updated on Sep 27 2026 7:50 AM

Bigg Boss Season 10 Telugu weekend episode highlights

ఈ వీకెండ్ బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ మరింత రసవత్తరంగా సాగింది. నాగార్జున వచ్చే ఈ ఎపిసోడ్‌లో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు బయటికొస్తాయి. ‍అలా ప్రతి కంటెస్టెంట్‌ చేసిన తప్పులన్నీ ఈ వీకెండ్‌ షోలో నాగ్‌ బయటపెట్టడమే కాదు.. వారికి వార్నింగ్ కూడా ఇస్తుంటారు. అలాంటిది ఈ వారాంతంలో నాగార్జున్‌ కంటెస్టెంట్సకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం హౌస్‌లో టెంప్టేషన్‌ వర్సెస్‌ టెన్షన్‌ గేమ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హౌస్‌మేట్స్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. డబ్బులు ఆఫర్‌ చేసి కంటెస్టెంట్స్‌ను టెంప్టింగ్‌ చేశాడు.

ఈ ఆఫర్‌ను చాలామంది కంటెస్టెంట్స్ తిరస్కరించారు. కానీ వైల్డ్ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన మిథిలేశ్‌ చేయి ఎత్తి తాను తీసుకుంటానని ముందుకొస్తాడు. దీంతో అతనికి.. కంటెస్టెంట్లకు మధ్య మినీ వార్ నడుస్తుంది. అదే సమయంలో నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌కి సెట్‌ కావ్.. వెళ్లు అని సూట్‌కేస్‌ ఇచ్చేస్తాడు.  మరి మిథిలేశ్‌ ఆ రూ.15 లక్షలతో బయటికెళ్లాడా? లేదా అన్నది ఈ వీకెండ్‌ ఎపిసోడ్ హైలెట్స్‌లో చూసేద్దాం.

వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మిథిలేశ్..

ఈ వారంలో అపూర్వ, మిథిలేశ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వీక్‌ బిగ్‌బాస్‌ మరింత ఆసక్తికరంగా మారింది.  మొదట ఈ వారంలో హౌస్‌మేట్స్‌ వ్యవహరించిన తీరుపై నాగ్‌ ప్రశ్నలవర్షం కురిపించారు.  

రూ.15 లక్షల ఆఫర్‌..

ఈ వీకెండ్‌లో సందీప్, డైరెక్టర్ జాసన్ సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. సిగ్మా ప్రమోషన్లలో భాగంగా ఈ షోకు వచ్చారు. . హీరో సందీప్, హీరో త్రిగుణ్ మంచి ఫ్రెండ్స్ కావడంతో సరదాగా మాట్లాడుకున్నారు. త్రిగుణ్ లవ్‌ స్టోరీ గురించి సందీప్‌ చెబుతూ ఆట పట్టించాడు. తర్వాత నాగ్ 16 మంది కంటెస్టెంట్స్‌ ముందు ఓ సూట్‌కేస్ పెట్టి అందులో మూడో వారంలోనే అందులో డబ్బు తీసుకొని మీరు వచ్చేయొచ్చని బిగ్‌ ఆఫర్ ఇస్తాడు. మొదట ఆ సూట్‌కేస్‌లో రూ.5 లక్షలు ఉన్నాయి? ఎవరు తీసుకుంటారని అడుగుతారు.. ఎవరు కూడా స్పందించరు. ఆ తర్వాత అమౌంట్‌ను పది లక్షలకు పెంచేస్తాడు. ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడంతో ఆ ‍అమౌంట్‌ను రూ.15 లక్షలకు పెంచేస్తాడు. ఈ డబ్బులకు టెంప్ట్ అయిన మిథిలేశ్ నేను తీసుకుంటానని చేయి పైకెత్తి రెడీ అయిపోతాడు.

మిథిలేశ్‌కు నాగ్‌ ట్విస్ట్‌..

ఆ సూట్‌ కేస్ తీసుకోవడానికి రెడీ అయిన మిథిలేశ్‌కు నాగ్‌ ఓ ట్విస్ట్ ఇస్తాడు. అయితే ఆ డబ్బు మీ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని చెప్తాడు. కానీ అతన్ని బయటికెళ్లకుండా ఒప్పించాలని కంటెస్టెంట్లకు నాగ్  చిన్న పరీక్ష పెడతాడు. ఆ తర్వాత అతన్ని ఆపేందుకు కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తారు. కానీ చివరికీ మిథిలేశ్‌ నువ్వు బిగ్‌బాస్‌కి పనికిరావు.. డబ్బు తీసుకొని వెళ్లిపోని అని రాంప్రసాద్ కాస్తా ఆగ్రహంగానే చెప్తాడు. కానీ ఇంట్లో ఎక్కువ మందిని ఒప్పించి సూట్‌కేస్ తీసుకోమని అంటారు. దీంతో ఎక్కువమందిని ఒప్పించిన మిథిలేశ్‌ రూ.15 లక్షల సూట్‌కేస్‌తో బయటకు వస్తాడు. దీంతో వీకెండ్‌ ఎపిసోడ్‌ ముగుస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement