– ఆకాష్ జగన్నాథ్
‘‘చకోర’ సినిమా చూశాను... చాలా బాగుంది. శ్రవణ్, మలైక నటన చూశాక ఈ కథకు వీళ్లు తప్ప ఎవరూ యాప్ట్ కాదనిపించింది. మంగా శ్రీనివాస్‌గారికి ఈ మూవీ పెద్ద విజయాన్ని అందించాలి. అలాగే ఇలాంటి యంగ్ టీమ్‌తో సినిమా నిర్మించిన హేమారావుగారికి అభినందనలు’’ అని హీరో ఆకాష్ జగన్నాథ్ పేర్కొన్నారు.
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా మంగా శ్రీనివాస్ రచన–దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చకోర–లునార్ లవ్ బర్డ్’. డా. చింతాడ హేమారావు నిర్మించిన ఈ సినిమా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ఆకాష్ జగన్నాథ్ అతిథిగా హాజరై, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘పేరున్న హీరోలను సంప్రదించి వారితో సినిమా చేయడం సులువు కాదు. అందుకే శ్రవణ్, మలైకాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాను. నా విజన్‌కు తగినట్లు వారు బాగా నటించారు’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటే మా సినిమాకి రావాలి’’ అన్నారు శ్రవణ్. ‘‘ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని ఒక కొత్త తరహా ప్రేమకథను మా సినిమాలో చూస్తారు’’ అని చింతాడ హేమారావు, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు చె΄్పారు. ఈ సినిమాకి కెమెరా: రుప్ప గోపీకృష్ణ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ.


