‘లవ్ అండ్ వార్’.. ఆసక్తి పెంచుతున్న విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ | Vicky Kaushal First Look Poster Out From Sanjay Leela Bhansali Love and War | Sakshi
Sakshi News home page

‘లవ్ అండ్ వార్’.. ఆసక్తి పెంచుతున్న విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్

Sep 26 2026 8:44 PM | Updated on Sep 26 2026 8:53 PM

Vicky Kaushal First Look Poster Out From Sanjay Leela Bhansali Love and War

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’. దీనిపై  భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం నేడు విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో విక్కీ కౌశల్ సిగరెట్, లైటర్‌తో కనిపిస్తూ ఎంతో ఇంటెన్స్‌గా చూస్తున్న తీరు సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.

కాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
 
తాజాగా అలియా భట్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లో మెరిసింది.  స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని  పూర్తిగా కొత్త అవతారంలో కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement