breaking news
frist look
-
‘లవ్ అండ్ వార్’.. ఆసక్తి పెంచుతున్న విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం నేడు విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్లో విక్కీ కౌశల్ సిగరెట్, లైటర్‌తో కనిపిస్తూ ఎంతో ఇంటెన్స్‌గా చూస్తున్న తీరు సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.కాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. తాజాగా అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లో మెరిసింది. స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని పూర్తిగా కొత్త అవతారంలో కనిపించింది. -
పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ .. ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
మంచు మనోజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమా రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. నేడు రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసేంది. దీనిని మంచు మనోజ్ పోస్ట్ చేస్తూ ఈమెతో కలిసి వెండితెరపై నటించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా ఈ లుక్‌లో రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. 1897, 1920ల మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో మారియా ర్యాబోషాప్కా హీరోయిన్గా కనిపించనున్నారు. సముద్రఖనితో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
మమ్ముట్టి అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లు అందుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఓమ్’ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ బయటికొచ్చింది. దీంతో మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదీ చదవండి: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులుసినిమా విషయానికి వస్తే..మమ్ముట్టి, దర్శకుడు నితీష్ సహదేవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మేళా’. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ బ్యానర్లో వస్తున్న తొమ్మిదో చిత్రమిది. ఈ చిత్రానికి అనురాజ్ ఓ.బి., నితీష్ సహదేవ్ కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. నితీశ్ సహదేవ్ గతంలో ‘ఫ్యామిలీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలోనే ప్రారంభమైనట్లు సమాచారం.ఓమ్: ధనుష్, ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో..మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే 2019లో విడుదలైన యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముమ్ముట్టి. మంచి విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా యాత్ర2ను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఈ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో ముమ్ముట్టి కనిపించారు. ( స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?) -
మంచు శివలింగం తొలి దర్శనం
అనంతనాగ్: అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమవుతోంది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర గుహలో కొలువైన బాబా బర్ఫానీ (శివలింగం) తొలి దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శివభక్తులలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనుంది. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. యాత్ర విజయవంతానికి జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక 'ప్రథమ పూజ' నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది.కట్టుదిట్టమైన భద్రతా వలయంయాత్ర నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను భారీగా పెంచారు. ముఖ్యంగా అనంతనాగ్ జిల్లాలో పహారా ముమ్మరం చేశారు. కశ్మీర్ జోన్ ఐజీపీ, డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నిరంతర నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు భద్రతా దళాలను ఆదేశించారు.మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టియాత్రకు వచ్చే భక్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 30 నాటికి అందరికీ తప్పనిసరిగా ఆర్ఎఫ్ఐడీ కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు. బేస్ క్యాంపుల వద్ద నెట్వర్క్ సమస్యలు తలెత్తకుండా టెలికాం సంస్థలకు కీలక సూచనలు చేశారు. యాత్ర మార్గంలో పోనీ స్టాండ్ల నిర్మాణం, ఫెన్సింగ్, షెడ్ల వంటి మౌలిక సదుపాయాలన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు. -
టైటిల్ గెస్ చేస్తే చాలు... సినిమాలో నటించొచ్చు!
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని రమేశ్ హీరోగా ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతోంది.హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ప్రీలుక్ పోస్టర్ విడుదలైంది. రక్తంతో తడిసిన పదునైన కత్తిని ఎవ్వరికీ కనిపించకుండా వీపున దాచి పెట్టిన హీరో లుక్ ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఈ ప్రీ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్ జానర్ లో రాబోతున్న ఈ చిత్రంలో ఏదో కొత్త వైవిద్యం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. కాగా, ఈ పోస్టర్ చూసి సినిమా టైటిల్ గెస్ చేసే అవకాశం ప్రేక్షకులకే కల్పించింది చిత్రయూనిట్. ఎవ్వరైతే ఈ టైటిల్ గెస్ చేసి ఈ మెయిల్ కి (Info@smlproductions) పంపిస్తారో వారికి తమ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న తదుపరి సినిమాలో అవకాశం కల్పిస్తామని నిర్మాతలు తెలిపారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్. -
‘గుంటూరు టాకీస్’ సినిమా ఫస్ట్ లుక్


