నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్పందన కనిపిస్తోంది. ఇందులో సంపూర్ణేష్ బిర్యాని పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా చిత్రం బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సంపూర్ణేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవున్నాయి.
చాలా సంతోషంగా ఉంది..
‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. నా గెటప్ ముందల నాని అన్న.. ఓ సందర్భంలో చాలా టేక్‌లు తీసుకున్నా.. అసలు ఈ సినిమా చేస్తామా? లేదా అనిచాలా భయం వేసింది. అప్పుడు నాని అన్న చాలా సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కొబ్బరిమట్ట రిలీజ్ తర్వాత ఆగిన ఫొన్ మళ్లీ ‘ది ప్యారడైజ్’ తర్వాతే మోగింది. మధ్యలో చాలా సినిమాలు వచ్చినా ఇంత గుర్తింపు రాలేదు. ఇది చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది’ అని భావేద్వేగంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడారు.
ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్
Kobbari Matta తర్వాత ఆగిన Phone Calls …#TheParadise తర్వాత మళ్లీ మోగింది! 🔥#SampoorneshBabu #Nani pic.twitter.com/S022LFD6A6
— Milagro Movies (@MilagroMovies) September 26, 2026


