నటుడికి కారుణ్య మరణం.. ఎమోషనల్‌గా చివరి పోస్ట్‌ | French Actor Director Arnaud Denis Passed Away By Euthanasia | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల నటుడికి కారుణ్య మరణం.. ఎమోషనల్‌గా చివరి పోస్ట్‌

Sep 26 2026 5:12 PM | Updated on Sep 26 2026 5:38 PM

French Actor Director Arnaud Denis Passed Away By Euthanasia

ఫ్రెంచ్‌ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్నాడ్‌ డెనిస్‌ 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా తుదిశ్వాస విడిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

 ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్టు 
మరణానికి ముందు ఆర్నాడ్‌ ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్టు చేశారు.గత మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఎంతో బాధను అనుభవించినట్లు ఆయన అందులో పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో ఇక ఆ బాధను భరించే శక్తి తనకు లేదని తెలిపారు. తనతో ఈ పోరాటంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. తన నిర్ణయం ఎవరినీ ప్రేరేపించకూడదని కోరిన ఆర్నాడ్‌.. తన అనారోగ్యం గురించి ప్రజలకు అవగాహన కలగాలని ఆకాంక్షించారు. ఈ వ్యాధిపై వైద్య పరిశోధనలు మరింతగా జరిగి, భవిష్యత్తులో మెరుగైన చికిత్స అందుబాటులోకి రావాలని కోరుకున్నారు.
ఇదీ చదవండి: చాలా ఏళ్లు తర్వాత సినిమాకి వెళ్తున్నా: కేటీఆర్‌

ఆపరేషన్‌ తర్వాత మొదలైన సమస్యలు
ఆర్నాడ్‌ డెనిస్‌ 2023లో హెర్నియా చికిత్స కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాను మయాల్జిక్‌ ఎన్సెఫలోమైలిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా క్రమంగా కండరాల బలహీనత పెరిగి.. శరీరంపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఎదురైందని ఆర్నాడ్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ..
ఆర్నాడ్‌ డెనిస్‌ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు. 2009లో ‘లెస్‌ ఫెమ్స్‌ సవాంటెస్‌’ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రతిష్ఠాత్మక బ్రిగేడియర్‌ అవార్డు కూడా అందుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా ఆయన కెరీర్‌కు దూరమయ్యారు. చివరకు 43 ఏళ్ల వయసులో బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా ఆయన కన్నుమూయడం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి: కొత్త లుక్‌లో అనసూయ.. ఫొటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement