breaking news
denis
-
నటుడికి కారుణ్య మరణం.. ఎమోషనల్‌గా చివరి పోస్ట్
ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్నాడ్ డెనిస్ 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా తుదిశ్వాస విడిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఫేస్బుక్లో భావోద్వేగ పోస్టు మరణానికి ముందు ఆర్నాడ్ ఫేస్బుక్లో భావోద్వేగ పోస్టు చేశారు.గత మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఎంతో బాధను అనుభవించినట్లు ఆయన అందులో పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో ఇక ఆ బాధను భరించే శక్తి తనకు లేదని తెలిపారు. తనతో ఈ పోరాటంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. తన నిర్ణయం ఎవరినీ ప్రేరేపించకూడదని కోరిన ఆర్నాడ్.. తన అనారోగ్యం గురించి ప్రజలకు అవగాహన కలగాలని ఆకాంక్షించారు. ఈ వ్యాధిపై వైద్య పరిశోధనలు మరింతగా జరిగి, భవిష్యత్తులో మెరుగైన చికిత్స అందుబాటులోకి రావాలని కోరుకున్నారు.ఇదీ చదవండి: చాలా ఏళ్లు తర్వాత సినిమాకి వెళ్తున్నా: కేటీఆర్ఆపరేషన్ తర్వాత మొదలైన సమస్యలుఆర్నాడ్ డెనిస్ 2023లో హెర్నియా చికిత్స కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాను మయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా క్రమంగా కండరాల బలహీనత పెరిగి.. శరీరంపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఎదురైందని ఆర్నాడ్ తరఫు న్యాయవాది తెలిపారు.నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ..ఆర్నాడ్ డెనిస్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు. 2009లో ‘లెస్ ఫెమ్స్ సవాంటెస్’ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రతిష్ఠాత్మక బ్రిగేడియర్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా ఆయన కెరీర్‌కు దూరమయ్యారు. చివరకు 43 ఏళ్ల వయసులో బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా ఆయన కన్నుమూయడం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: కొత్త లుక్‌లో అనసూయ.. ఫొటోలు వైరల్ -
కలిసి బతకలేమని పారిపోయి..
ఒకరినొకరు ఇష్టపడి కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఓ యువజంట తల్లిదండ్రులు అందుకు అంగీకరించరని తెలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ యువజంట ఆత్మహత్య వాయువ్య రష్యాలో కలకలం రేపింది. పీఎస్కోవ్ ప్రాంతానికి చెందిన డెనిస్ మురావ్యోవ్(15), కత్యా(15)లు మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. అంతకుముందు కత్యాను తీసుకుని వెళ్లడం కోసం ఆమె ఇంటికి వెళ్లిన డెనిస్.. కత్యాను ఆమె తల్లి మందలిస్తుండటంతో ఆమెపై కాల్పులు జరిపాడు. కాగా ఈ కాల్పుల్లో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. అక్కడి నుంచి పారిపోయిన యువజంట క్రస్నియే స్ట్రుగీ అనే గ్రామంలోని కత్యా అంకుల్ ఇంటికి చేరింది. మహిళపై కాల్పులు జరిపి పారిపోయిన యువజంటను పట్టుకునేందుకు రష్యా జాతీయ దళాలు రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించాయి. ఈ విషయం తెలుసుకున్న యువజంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాము ఒకరిని విడిచి మరొకరం బతకలేమని ఆత్మహత్య చేసుకోబోయే కొద్ది గంటల ముందు సోషల్ మీడియాలో రాసుకుంది. ఇంట్లో పెద్ద ఎత్తున బుల్లెట్లు, అందుబాటులో ఉన్న ఆయుధాలను సిద్ధం చేసుకున్న జంట తాము పోలీసులకు లొంగిపోతే ఒకరినొకరు ఎప్పటికీ కలుసుకోలేమని, అదే లొంగిపోకపోతే చనిపోతామని.. ఎడబాటు కన్నా చనిపోవడమే ఉత్తమని పేర్కొన్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసు వాహనంపై డెనిస్ పలుమార్లు కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను డెనిస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. కొద్ది గంటల పాటు యువజంటను ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించిన భద్రతా దళాలు వారు మాట వినపోతుండటంతో ఇంటిపై గ్రేనేడ్లు విసిరి లోపలికి ప్రవేశించాయి. దీంతో ఆ యువజంట తమని తాము కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది. కాగా ఘటన పూర్తి స్ధాయిలో విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.


