కలిసి బతకలేమని పారిపోయి.. | Two schoolchildren live-streamed themselves in a shootout with police before turning their guns on themselves | Sakshi
Sakshi News home page

కలిసి బతకలేమని పారిపోయి..

Nov 15 2016 4:59 PM | Updated on Nov 6 2018 7:56 PM

కలిసి బతకలేమని పారిపోయి.. - Sakshi

కలిసి బతకలేమని పారిపోయి..

ఒకరినొకరు ఇష్టపడి కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఓ యువజంట తల్లిదండ్రులు అందుకు అంగీకరించరని తెలిసి ఆత్మహత్య చేసుకుంది.

ఒకరినొకరు ఇష్టపడి కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఓ యువజంట తల్లిదండ్రులు అందుకు అంగీకరించరని తెలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ యువజంట ఆత్మహత్య వాయువ్య రష్యాలో కలకలం రేపింది. పీఎస్కోవ్ ప్రాంతానికి చెందిన డెనిస్ మురావ్యోవ్(15), కత్యా(15)లు మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు.

అంతకుముందు కత్యాను తీసుకుని వెళ్లడం కోసం ఆమె ఇంటికి వెళ్లిన డెనిస్.. కత్యాను ఆమె తల్లి మందలిస్తుండటంతో ఆమెపై కాల్పులు జరిపాడు. కాగా ఈ కాల్పుల్లో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. అక్కడి నుంచి పారిపోయిన యువజంట క్రస్నియే స్ట్రుగీ అనే గ్రామంలోని కత్యా అంకుల్ ఇంటికి చేరింది. మహిళపై కాల్పులు జరిపి పారిపోయిన యువజంటను పట్టుకునేందుకు రష్యా జాతీయ దళాలు రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించాయి. ఈ విషయం తెలుసుకున్న యువజంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement