కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. పదో తరగతి బాలుడిని చంపి.. | Khammam Class 10 Student Loses Life | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. పదో తరగతి బాలుడిని చంపి..

Nov 10 2026 3:31 PM | Updated on Nov 10 2026 3:34 PM

 Khammam Class 10 Student Loses Life

ఖమ్మం: జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధం విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతాడన్న కారణంతో పదో తరగతి విద్యార్థిని ఇద్దరు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాలుడికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సుమారు 20 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చిన్న కోరుకొండ గ్రామానికి చెందిన రవి (15) పదో తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అపర్ణ, అజయ్‌ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి రవికి తెలిసినట్లు సమాచారం. దీంతో తమ సంబంధం బయటపడుతుందనే భయంతో అపర్ణ, అజయ్‌ బాలుడిని అంతమొందించాలని కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా రవికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించారు. చివరకు చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందాడు.

బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అపర్ణ, అజయ్‌ల పాత్ర వెలుగులోకి రావడంతో ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో అభం శుభం తెలియని బాలుడి ప్రాణాలు తీసిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement