నీలమ్మకు విమలక్క నివాళి | Neelamma the life partner of Acharya Jayadhir Tirumala Rao has passed away | Sakshi
Sakshi News home page

నీలమ్మకు విమలక్క నివాళి

Nov 10 2026 12:26 PM | Updated on Nov 10 2026 12:26 PM

Neelamma the life partner of Acharya Jayadhir Tirumala Rao has passed away

హైదరాబాద్‌: ప్రముఖ పరిశోధకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు జీవిత సహచరిణి నీలమ్మ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారిణి విమలక్క ఆమెకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ సంతాస సందేశం విడుదల చేశారు.

గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రొఫెసర్ తిరుమలరావు దంపతులు ప్రజా సంస్కృతికోద్యమానికి ఎనలేని అండదండలు అందిస్తూ వస్తున్నారు. జయధీర్ తిరుమలరావు  సుదీర్ఘ కృషిలో, పరిశోధనల్లో నీలమ్మ గారి పాత్ర ఎంతో కీలకమైనది. ఆద్యకళకు అమ్మగా, అరుణోదయకు ఆత్మబంధువుగా ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ ఆమె నివాళులు అర్పించారు. కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలిచి, ఆకలిగొన్నవారిని ఆదరించిన అమ్మ నీలమ్మ అని ఆమె స్మరించుకున్నారు.  నీలమ్మ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమెకు హృదయపూర్వక విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ తిరుమల రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఆద్య కళా కుటుంబానికి, బంధుమిత్రులందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అరుణోదయను ‘పాలపిట్టల గుంపు’గా వర్ణించిన తిరుమలరావు..ఆ గుంపులో నీలమ్మను స్ఫూర్తిగా నిలుపుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలని విమలక్క ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement