వచ్చే నెలలో సినిమా రిలీజ్.. ఇంతలోనే విషాదం | Malayalam Cinematographer Shaji Kumar No More | Sakshi
Sakshi News home page

Shaji Kumar: విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

Nov 10 2026 9:01 AM | Updated on Nov 10 2026 9:02 AM

Malayalam Cinematographer Shaji Kumar No More

మలయాళ ఇండస్ట్రీలో విషాదం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్.. మంగళవారం తెల్లవారుజామున కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. సినిమా షూటింగ్ సెట్‌లో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఈయనకు గత రెండు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

చనిపోవడానికి రెండు రోజుల ముందు అలప్పుజాలో దిలీప్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌లో షాజీ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తొలుత ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు.. ఆరోగ్యం కొంత సర్దుకోవడంతో సాధారణ గదికి మార్చారు. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అలా తుదిశ్వాస విడిచారు.

దాదాపు దశాబ్దానికి పైగా సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్న షాజీ కుమార్ 50కి పైగా సినిమాలకు పనిచేశారు. మాస్ యాక్షన్ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2016లో విడుదలైన బ్లాక్‌బస్టర్ 'పులిమురుగన్' మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీనితో పాటు నరన్, ఒడియన్, మధురరాజా, రామలీలా, నస్రాణి, రాబిన్‌హుడ్, బాబా కళ్యాణి, వెల్లినక్షత్రం, అద్భుతద్వీప్, రింగ్ మాస్టర్, మల్లు సింగ్, పథొన్‌పతం నూట్టాండు, బాంద్రా, కాతికన్, తొడరుమ్ తదితర చిత్రాలకు షాజీ కెమెరామెన్‌గా పనిచేశారు. అయితే చనిపోవడానికి ముందే అతిమనోహరం, ఒట్టకొంబన్ చిత్రాల వర్క్ పూర్తి చేశారు. వీటిలో మోహన్ లాల్ హీరోగా చేసిన 'అతిమనోహరం' వచ్చే నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఇంతలో షాజీ కుమార్ మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల గ్యాప్ అందుకే తీసుకున్నా: నజ్రియా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement