‘శివాలయం’ మూవీ పోస్టర్‌ విడుదల | Shivalayam Movie Poster | Sakshi
Sakshi News home page

‘శివాలయం’ మూవీ పోస్టర్‌ విడుదల

Nov 9 2026 9:21 PM | Updated on Nov 9 2026 9:21 PM

Shivalayam Movie Poster

తెలుగు ప్రేక్షకులను భక్తిరసంతో అలరించేందుకు మరో ఆధ్యాత్మిక చిత్రం సిద్ధమవుతోంది.  శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమ‌తి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహ‌రెడ్డి చిత్రాల‌యం సంయుక్త‌ బ్యానర్‌ల‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’. ఈ సినిమా టీజర్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. 

కాగా ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి, ధ‌న్‌రాజ్, సుష్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌రెడ్డి నందితో పాటు కళ్లెం నర్సింహారెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఘర్షణ శ్రీనివాస్, స‌మ్మెట గాంధీ, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

(ఇదీ చదవండి: నేను హీరోయిన్‌గా అమ్మకి ఇష్టం లేదు.. సర్జరీ చేసుకున్నా..: జాన్వీ కపూర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement