నేను హీరోయిన్‌గా అమ్మకి ఇష్టం లేదు.. సర్జరీ చేసుకున్నా..: జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Nose Surgery Sridevi Heroine Debut Revelation | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ‘హీరోయిన్‌ అవుతా అంటే అమ్మకి ఇష్టం లేదు’

Nov 9 2026 8:35 PM | Updated on Nov 9 2026 8:41 PM

Janhvi Kapoor Nose Surgery Sridevi Heroine Debut Revelation

బాలీవుడ్‌లో స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి ఆమె కజిన్‌, నటి మహేశ్వరి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలను జాన్వీ కపూర్‌ వెల్లడించారు. తాను హీరోయిన్ కావడం శ్రీదేవికి మొదట్లో ఏమాత్రం ఇష్టం లేదని తెలిపింది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

హీరోయిన్ అవుతానంటే..
జాన్వీ సినిమాల్లోకి రావాలనుకుంటున్న విషయంపై శ్రీదేవి తనతో కూడా మాట్లాడారని మహేశ్వరి వెల్లడించారు. ‘జాను సినిమాల్లో నటించాలనుకుంటోంది. కానీ నాకెందుకో నమ్మకం లేదు. ఆ రంగానికి ఎంతో అంకితభావం, కఠిన శ్రమ, మానసిక దృఢత్వం అవసరం’ అని శ్రీదేవి తనతో చెప్పినట్లు మహేశ్వరి గుర్తుచేసుకున్నారు.

దీనిపై జాన్వీ స్పందిస్తూ.. ‘నిజం ఏంటంటే.. నా ముక్కు సర్జరీ జరగక ముందు వరకు నాలో హీరోయిన్ అయ్యే సత్తా ఉందని మా అమ్మ ఏమాత్రం నమ్మలేదు. ఆ సర్జరీ జరిగిన తర్వాతే నా రూపం, నా సామర్థ్యం పట్ల ఆమెకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి రావడానికి అంగీకరించారు’ అని తెలిపింది.

(ఇదీ చదవండి: రామాయణం’కి షాక్‌ ఇచ్చిన ‘గాడ్జిల్లా’)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement