సూర్య ‘సీన్‌’ మూవీపై మహేశ్‌బాబు రివ్యూ | Mahesh babu scene movie review | Sakshi
Sakshi News home page

Mahesh babu-Scene : సూర్య అద్భుతం.. తప్పక చూడాల్సిన సినిమా: మహేశ్‌బాబు

Nov 9 2026 5:34 PM | Updated on Nov 9 2026 5:53 PM

Mahesh babu scene movie review

 స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.  ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.145 కోట్ల గ్రాస్ వసూలు చేసినిట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా..
సూర్య యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్‌పై మహేష్ బాబు తన ట్వీట్‌లో ప్రశంసలు కురిపించారు. ‘ సినిమా చూశాను. చాలా కూల్‌గా, స్మార్ట్‌గా, ఆద్యంతం ఎంతో ఫన్‌గా సాగింది. ఈ సినిమాలో ‘ఇన్‌బరాజ్’ పాత్రలో సూర్య నటన అద్భుతంగా ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ ఫ్యాబులస్.

కీలక పాత్రల్లో నటించిన నజ్రియా, నస్లెన్ కూడా ఫెంటాస్టిక్ గా నటించారు’ దర్శకుడు జితు మాధవన్ శ్రమ కనిపిస్తోంది. ఆయన రైటింగ్‌, సినిమా తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉంది’ అని ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో పాటు ప్రతి ఒక్కరూ కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని మహేష్ పిలుపునిచ్చారు. 

(ఇదీ చదవండి: బొద్దుగా..లావుగా ఉండేవాడిని.. అలా కాకుండా ఉంటే: ఎన్టీఆర్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement