రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన మూవీ రామాయణ. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. అయితే థియేటర్లలో సినిమాను రికార్డు చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేయడంపై బాంబే హైకోర్టు సీరియస్ అయినట్లు లీగల్ నోటీసు ద్వారా తాజాగా వెల్లడించింది. ఈమేరకు చిత్ర బృందం పైరసీపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.
ఈ విషయంపై ఇటీవల బాంబే హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసిందని నోటీసులో పేర్కొంది. అనుమతి లేకుండా సినిమాను రికార్డు చేసి అప్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎవరైనా ఇలాంటి ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే.. వెంటనే వాటిని తొలగించాలని చిత్ర బృందం హెచ్చరించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నేరుగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
(ఇదీ చదవండి: కొడుకు ఫొటో రివీల్ చేసిన కత్రినా కైఫ్)
RAMAYANA MAKERS ISSUE A STRICT LEGAL WARNING Unauthorised recording, uploading and sharing of #Ramayana footage is strictly prohibited. The makers have warned of legal action against those violating copyright rules. Respect the creators. Watch it in cinemas, not through piracy! 🎬 #Ramayana #StopPiracy
— ft.uea_v (@FTCinemaBuzz) November 7, 2026


