మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున | Nagarjuna Comments About Social Media | Sakshi
Sakshi News home page

Nagarjuna: ‘కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు’

Nov 8 2026 8:45 PM | Updated on Nov 8 2026 8:45 PM

Nagarjuna Comments About Social Media

అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'.  నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌ గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నాగార్జున తొలి సినిమా విడుదలకు ముందు నటీనటులు పడే ఆందోళన, నేటితరం ఎదుర్కొంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

రిలీజ్‌కు ముందు
‘మొదటి చిత్రం రిలీజ్‌కు ముందు రోజుల్లో మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. సినిమా కోసం ప్రాణం పెట్టి కష్టపడతాం, ఆ గుర్తింపును కాపాడుకోవడానికి నిరంతరం పరిగెడుతూనే ఉండాలి. ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమయ్యే డెబ్యూ హీరోలకైతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ప్రశాంతంగా నిద్రపోవడమే’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారు.

మేము చాలా అదృష్టవంతులం
‘మా సమయంలో సోషల్ మీడియా లేదు కాబట్టి మేము చాలా అదృష్టవంతులం. కానీ  ప్రస్తుతం సోషల్ మీడియా ఓ రాక్షసిలా మారింది. అందుకే ఈ రంగంలోకి వచ్చే కొత్త హీరోలు మానసికంగా గట్టిగా సిద్ధపడి రావాలి’  అని స్పష్టం చేశారు.

(ఇదీ చదవండి: 90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement