టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీయెస్ట్ సినిమాల్లో 'వారణాసి' టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నుంచి వస్తున్న తర్వాత మూవీ ఇదే. మహేశ్ బాబు హీరో కాగా లేటెస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ డివోషనల్ కాన్సెప్ట్ ఇందులో కీలకం. అయితే 'వారణాసి' ప్రపంచం ఎలా ఉండబోతుందో ఓ మూడు నిమిషాల గ్లింప్స్‌తో చూపించిన జక్కన్న.. మిగతా ఏ డీటైల్స్ బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. కానీ సినిమా స్టోరీ ఇదేనని సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్)
రాజమౌళి చెప్పిన దాని ప్రకారం 'వారణాసి'లో ప్రస్తుతంతో పాటు రాముడు జీవించిన త్రేతాయుగం సీన్స్ కూడా ఉండనున్నాయి. ఇందులో భాగంగా మహేశ్.. శ్రీరాముడిగానూ కనిపించనున్నాడు. అయితే అసలు కథ అంతకు మించి ఉందని సోషల్ మీడియాలో థియరీలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం స్టోరీ ఇలా ఉండనుందట.
కుంభకర్ణుడే పునర్జన్మ ఎత్తి విలన్ కుంభ(పృథ్వీరాజ్ సుకుమారన్)గా మారతాడు. కాలు కూడా కదపలేని ఇతడు.. తన సోదరుడు రావణుడికి చెందిన తొమ్మిది వజ్రాలని ఎలాగైనా సొంతం చేసుకోవాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ వజ్రాలు.. రామ-రావణ యుద్ధం జరిగినప్పుడు చెల్లాచెదురు అయిపోయి వేర్వేరు దేశాల్లోకి వెళ్లిపోతాయి. కుంభ కాలు కదపలేడు కాబట్టి వాటిని తీసుకురమ్మని రుద్ర(మహేశ్ బాబు)ని పంపిస్తాడు. ఈ క్రమంలోనే రుద్ర.. రామాయణం జరిగిన కాలంలోకి ప్రయాణిస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్.
వజ్రాల దక్కించుకుంటున్న టైంలో రుద్రకి కుంభ అసలు లక్ష్యమేంటో తెలుస్తుంది. దీంతో వాటిని కుంభకి దక్కనీయకుండా చేయాలని గతంలోకి ప్రయాణిస్తాడు. రామ-రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు వజ్రాలు విడిపోకుండా చేస్తాడు. దీంతో ప్రస్తుతంలో కుంభ మనసులో వజ్రాల్ని దక్కించుకోవాలనే ఆలోచన రాదు. అలా కథ సమాప్తం.
వినడానికి విజువల్‌గా ఊహించుకోవడానికి హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ కథలా ఉంది గానీ మరి నిజమా కాదా అనేది 'వారణాసి' రిలీజైతే గానీ చెప్పలేం.
(ఇదీ చదవండి: అనిరుధ్ పెళ్లి.. విదేశానికి రజనీకాంత్, స్టాలిన్ ఫ్యామిలీస్)


