సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోదరి మంజుల ఘట్టమనేని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజు (నవంబర్ 8) జరిగిన ఈ వేడుకకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.
(ఇదీ చదవండి: మాట రాదు.. వినిపించదు.. నటనతో మెప్పిస్తూ..)
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్క దగ్గర సమావేశమయ్యారు. ఆమెతో కేక్ కట్ చేయించి, కేక్ తినిపిస్తూ ఆనందంగా గడిపారు. ఫొటోల్లో మహేష్ బాబుతో పాటు నమ్రత, సితార, నటుడు సుధీర్ బాబు, మహేష్ సోదరి ప్రియదర్శిని, మంజుల భర్త సంజయ్ స్వరూప్ కనిపించారు. కుటుంబ సభ్యులంతా కలిసి కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?)
తన సోదరి #Manjulaghattamaneni బర్త్ డే సెలబ్రేషన్స్ లో #Maheshbabu #Rudhra #Varanasi #Diwali2026 https://t.co/ttmuteIJ4T
— SZN (@Suzenbabu) November 8, 2026


