మాట రాదు.. వినిపించదు.. నటనతో మెప్పిస్తూ.. | Actor Abhinaya emotional Story | Sakshi
Sakshi News home page

Actor Abhinaya: అభినయమే ఆమెకు అసలైన బలం

Nov 7 2026 8:51 PM | Updated on Nov 7 2026 9:00 PM

Actor Abhinaya emotional Story

సినిమా రంగంలో రాణించాలంటే అందమే కాదు..ప్రతిభ ఉంటే చాలని ఎంతో మంది నటీనటులు నిరూపించారు. తమలోని ప్రత్యేకమైన నైపుణ్యంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి వారిలో నటి అభినయ ఒకరు. చిన్నప్పటి నుంచి మాటలు, వినికిడి శక్తి లేకపోయినా.. తన అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె.. తాజాగా ‘మహాశక్తి’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించారు. దీంతో ఇప్పుడు ఈ నటి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

చిన్నప్పటి నుంచే..
అభినయ అసలు పేరు అభినయ శ్రీ. చిన్నప్పటి నుంచి మాటలు, వినికిడి సమస్యతో బాధపడుతున్న ఆమె.. తనలోని నటనా ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  తన ముఖ కవళికలు, కళ్లతో పలికించే భావాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పాత్రకు తగ్గట్టుగా హావభావాలను పలికించడం ఆమె ప్రత్యేకత. నటననే తన బలంగా మార్చుకున్నారు. దీంతో స్టార్‌ హీరోయిన్లకు ధీటుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె సైన్ లాంగ్వేజ్ ద్వారానే మాట్లాడుతుంటారు. ఈమె సైగలతో చెబుతుంటే పక్కన ఉన్న ఆమె తల్లి లేదా  ఇంకేవరైనా దానిని వాయిస్‌ రూపంలోకి అనువదిస్తారు. కాగా అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్‌)తో 2025లో పెళ్లి చేసుకున్నారు. 

సినిమాల విషయానికి వస్తే.. 
తమిళ చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అభినయ. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో ‘శంభో శివ శంభో, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.  తాజాగా నయనతార, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాశక్తి’ సినిమాలోనూ అభినయ కనిపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement