నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఈ చిత్రం నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్ పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. కాగా ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


