breaking news
Vrushakarma Movie
-
వృషకర్మ ఫిక్స్
నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘‘మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో నాగ చైతన్య వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: రాగుల్ హెరియన్. -
కాంబినేషన్ సెట్?
నాగచైతన్య హీరోగా నటించిన తాజా సినిమా ‘వృషకర్మ’. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ చిత్రం డిసెంబరులో విడుదల కానుందట. ‘వృషకర్మ’ తర్వాత నాగచైతన్య హీరోగా నటించబోయే సినిమాకు క్లాక్స్, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, పీఎస్ మిత్రన్ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఎవరూ ఫైనలైజ్ కాలేదు. తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి పేరు తెరపైకి వచ్చింది. ‘సార్, లక్కీభాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ ’.. ఇలా వరుస హిట్ చిత్రాలతో దూసుకెళుతోన్న వెంకీ అట్లూరి డైరెక్షన్ లో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. నాగచైతన్య 25వ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ వెంకీ అట్లూరికి లభించినట్లే. మరి.. ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... నాగచైతన్యతో తాను ఎప్పుడో ఒక సినిమా చేయాల్సిందని, తన డైరెక్షన్ లో వచ్చిన కొన్ని సినిమాల కథలను నాగచైతన్యకు వినిపించానని, వివిధ కారణాల వల్ల సినిమా చేయడం కుదర్లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి పేర్కొన్నారు. -
డిసెంబరులో రిలీజ్?
‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ మూవీ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్ వినిపిస్తోంది. పౌరాణిక నేపథ్యం, థ్రిల్లింగ్ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం నాగచైతన్య ఫిజికల్‌గా కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఈ విషయాన్ని మార్చి 5న విడుదలైన గ్లింప్స్ స్పష్టం చేసింది. తన కెరీర్లో పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ‘వృష కర్మ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు చైతన్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కాగా ఈ చిత్రానికి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, రాగుల్ డి. హెరియన్ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే విషయంలో ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకీ తగ్గిపోతుంది. మరోవైపు ఓటీటీ సంస్థలు తమ దానిలో స్ట్రీమింగ్ ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాయి. ఇదివరకే నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ మూవీస్ లిస్ట్ ప్రకటించగా.. ఇప్పుడు జీ5 కూడా తమ దానిలో ఏకంగా 60 వరకు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయని వెల్లడించింది.(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?)తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇవన్నీ రాబోయే రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు వరకు అయితే ఈ ఓటీటీలోకి నాగచైతన్య 'వృషకర్మ', బాలకృష్ణ 111వ సినిమా, అనిల్ రావిపూడి-వెంకటేశ్ కొత్త మూవీ, నివేదా థామస్ 'శ్రీమతి', భూతం భయ్యం తదితర మూవీస్.. అలానే శ్రీకాంత్ 'అబ్జెక్షన్ మై లార్డ్', అనంతకాలం సిరీస్‌లు.. జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా 2' టాక్ షో ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే అన్ని భాషలు కలిపి 21 సినిమాలు 27 సిరీస్‌లు... చెరో ఆరు యానిమేషన్, ఏఐ మూవీస్ జాబితాలో ఉన్నాయి.జీ5 ఓటీటీలోకి వచ్చే సినిమాలు,సిరీస్లుఘమాశాన్ - హిందీ సినిమాబంధర్ - హిందీ మూవీకాంబ్లీ - హిందీ సిరీస్ద స్కామ్ లీక్డ్ - హిందీ సిరీస్బకైటీ 2 - హిందీ సిరీస్దలింబ్ - హిందీ మూవీరంగబాజ్ 4 - హిందీ సిరీస్లాల్ బజార్ 2 - హిందీ సిరీస్రావడి - తమిళ సినిమాతుంబచ్చి మంజుల - మరాఠీ మూవీకాఫీ కింగ్ - హిందీ సిరీస్హాయ్ - తమిళ సినిమాసుమో దీదీ - హిందీ మూవీకేరళ అండర్ గ్రౌండ్ - మలయాళ సిరీస్ఇక్ రూప్ - హిందీ మూవీశ్రీమతి - తెలుగు సినిమాఅబ్జెక్షన్ మై లార్డ్ - తెలుగు సిరీస్కూసే మునుస్వామి వీరప్పన్ 2 - తమిళ సిరీస్జాన్వర్ 2 - హిందీ సిరీస్హేయ్ కాయ్ నవీన్ 2 - హిందీ సిరీస్పూజా మేరీ జాన్ - హిందీ సినిమాహై జవానీ తో ఇష్క్ హోనా హై - హిందీ మూవీజీనా ఇసీ కా నామ్ హై 2.0 - హిందీ సిరీస్భారత భాగ్య విధాత - హిందీ సినిమాసర్వగుణ్ సంపన్న్ - హిందీ మూవీప్రియో బొందు - బెంగాలీ సిరీస్తడయమ్ 2 - తమిళ సిరీస్మలబార్ కప్ - మలయాళ సిరీస్కుడ్ల కప్ - తమిళ సిరీస్అగ ఆయ్ ఆహో ఆయ్ - హిందీ సిరీస్జయమ్ము నిశ్చయమ్మురా 2 - తెలుగు రియాలిటీ షోవెంకటేశ్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ - తెలుగు సినిమాథీ కురల్ - తమిళ సిరీస్స్వేట్కళి 2 - హిందీ సిరీస్భూతం భయ్యం - తెలుగు సినిమాఏ క్వీన్ - తమిళ సిరీస్వృషకర్మ - తెలుగు మూవీడీమోంటే కాలనీ 3 - తమిళ సినిమాఎన్బీకే 11 - తెలుగు మూవీజీ హారర్ షో - హిందీ సిరీస్ద డెవిల్ - కన్నడ సినిమాబిట్ కాయిన్ స్కామ్ - హిందీ సిరీస్ఆపరేషన్ బంగారా - హిందీ సిరీస్బాలన్ ద బాయ్ - మలయాళ సినిమాకరావళి - కన్నడ మూవీఅయ్యన మానే 2 - కన్నడ సిరీస్టీన్ టిగాడా - హిందీ సిరీస్అనంతకాలం - తెలుగు సిరీస్ఏఐ సినిమాలుశివశక్తి కీ అనంత్ కహానీపరమ్ సుందరి చంద్రకాంత కీ అమర్ ప్రేమకథ నర్మద మానస సుందరిగరుడ్ ఏక్ యోధ కీ కథతిరుపతి బాలాజీవిక్రమ్ బేతాళ్యానిమేషన్అయ్యప్పన్బార్బరిక్రామ్ ఆంజనేయ్ యుద్ధ్శివలోక్ కీ కుండక్క మండక్కబందబుద్ధి బుడబక్ 2.0టేల్స్ ఆఫ్ కృష్ణ(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్) -
కొత్త అనుభూతినిచ్చేలా...
నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృష కర్మ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.దీంతో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపి, రాజస్తాన్ లొకేషన్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్ప కళతో కనిపిస్తున్న ఈ లొకేషన్స్‌లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఓ హైలైట్ అని తెలుస్తోంది. ‘‘షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నాం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
దసరాకి వృషకర్మ?
హీరో నాగచైతన్య జైపూర్ వెళ్లారట. నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు స్పర్‡్ష శ్రీవాస్తవ విలన్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ రాజస్తాన్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్ కోసం నాగచైతన్య అండ్ టీమ్ హైదరాబాద్ నుంచి జైపూర్‌కు ప్రయాణం అయ్యారని సమాచారం.రాజస్తాన్‌లో జరిగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వస్తుందట. మే కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేసి, త్వరితగతిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసి, ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ .బి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్. -
నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్
-
కథ వినగానే నిర్మించాలనుకున్నాం: సుకుమార్
‘‘వృషకర్మ’ చిత్రకథని కార్తీక్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. అప్పుడే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. బాపినీడు, నేను కలిసి ఈ చిత్రం నిర్మించాలని డిసైడ్ అయ్యాం’’ అని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి. నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఇండస్ట్రీకి దొరికిన బెస్ట్ టెక్నీషియన్ కార్తీక్.అతను కథ చెప్పినప్పుడు విజువల్స్ ఇంత అద్భుతంగా వస్తాయని ఊహించలేదు... అద్భుతంగా చేశాడు. సంగీతదర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ‘విరూపాక్ష’ మూవీకి చాలా హెల్ప్ అయ్యాడు. ‘వృషకర్మ’ని కూడా అతను ఎంతగా ఎలివేట్ చేస్తాడో నాకు తెలుసు. డీఓపీ రఘుల్ ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమా కలర్ మారిపోయింది. నాగచైతన్య మొదటి నుంచి ఇన్వాల్ అవుతూ సినిమా అద్భుతంగా రావడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ప్రోడక్ట్ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉన్నాను. అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని సుకుమార్ పేర్కొన్నారు. -
నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


