దసరాకి వృషకర్మ? | Naga Chaitanya Vrushakarma To Release This Dasara | Sakshi
Sakshi News home page

దసరాకి వృషకర్మ?

Apr 1 2026 2:59 AM | Updated on Apr 1 2026 2:59 AM

Naga Chaitanya Vrushakarma To Release This Dasara

హీరో నాగచైతన్య జైపూర్‌ వెళ్లారట. నాగచైతన్య హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు స్పర్‌‡్ష శ్రీవాస్తవ విలన్‌ రోల్‌ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ రాజస్తాన్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌ కోసం నాగచైతన్య అండ్‌ టీమ్‌ హైదరాబాద్‌ నుంచి జైపూర్‌కు ప్రయాణం అయ్యారని సమాచారం.

రాజస్తాన్‌లో జరిగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వస్తుందట. మే కల్లా మొత్తం షూటింగ్‌ పూర్తి చేసి, త్వరితగతిన పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ కూడా పూర్తి చేసి, ఈ సినిమాను దసరాకు రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ .బి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అజనీష్‌ బి. లోక్‌నాథ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement