లవ్‌ విషయంలో ఇప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నా: నాగచైతన్య | Naga Chaitanya spoke About Love | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: టీనేజ్‌లో లవ్‌ని ఎంజాయ్‌ చేయండి: నాగచైతన్య

Nov 22 2026 7:47 PM | Updated on Nov 22 2026 8:10 PM

Naga Chaitanya spoke About Love

సినీ నేపథ్యం ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు అక్కినేని నాగచైతన్య. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ నటుడిగా కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ చిత్రంతో డిసెంబర్‌ 4 ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. తన సినీ ప్రయాణం, భార్య శోభిత, కుటుంబ సభ్యులు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ప్రేక్షకుల్లో ఆ నమ్మకం కలగాలి..
‘తెరపైకి వచ్చాక ఎవరి ప్రతిభ, కష్టమే వారిని నిలబెడతాయి. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి కష్టపడే కొత్తవారిని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఫేక్ పీఆర్, మార్కెటింగ్ ఎక్కువ కాలం నిలవవు. సినిమాకు అసలైన బలం ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రమే. ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లయినా నటుడిగా ఇంకా ఏదో సాధించాలన్న తపన నాలో ఉంది. నాగచైతన్య ఎలాంటి పాత్రనైనా చేయగలడు అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలి.

(ఇదీ చదవండి: ‘ఈఎన్‌ఈ’లో మరో నటుడిని తీసుకోవాలనుకున్నారు..కానీ..: శ్రీనాథ్)

తాతయ్యతో సినిమా..
‘సమయాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదని తాతయ్య నుంచే నేర్చుకున్నాను. ఏఎన్నార్‌తో కలిసి నటించడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఆయనతో ‘మనం’ సినిమాలో నటించడం ఎప్పటికీ నా ఫెవరెట్‌నే. ఆ సినిమాలో ఆయన్ని ఏరా అదీ ఇదీ అనాల్సి వచ్చింది. అది కాస్త కష్టంగా అనిపించింది.  

ప్రేమ గురించి..
‘ప్రేమ అనేది ఎప్పటికీ పూర్తిగా అర్థం కాని విషయం. నేను ఇప్పటికీ దాని విషయంలో కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నాను. అదొక అందమైన అనుభూతి. టీనేజ్‌లో ప్రేమను మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. దాన్ని ఒత్తిడిగా భావించకుండా ఆస్వాదించాలి. తప్పులు చేసినా వాటి నుంచి చాలా నేర్చుకుంటాం. టీనేజ్‌లో అయితే లవ్‌లో ఎంజాయ్‌ చేయాలి తప్పా.. దానికోసం ఎక్కువగా ఒత్తిడిని తీసుకోవద్దు.

శోభితలో నచ్చేది అదే!
నా విషయంలో ఏదైనా అనుకున్నది జరగకపోతే నేను అక్కడే ఆలోచించుకుని ఉండిపోతా. కానీ శోభిత అలా కాదు. అప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్ది ముందుకు నడిపిస్తుంది . అలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇలా ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. తనకు ఫ్యాషన్‌ అంటే చాలా ఇష్టం. నా ఫ్యాషన్, స్టైల్ మారడానికి పూర్తి క్రెడిట్ శోభితకే దక్కుతుంది. ఇప్పటికే నా వార్డ్‌రోబ్‌లో 20 శాతం మార్పులు చేసింది’ అని నాగచైతన్య తెలిపారు. 

(ఇదీ చదవండి: ‘వీళ్లలో అదొక్కటే తేడా..!’ మామా అల్లుళ్లపై మీనాక్షి కామెంట్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement