'ఈ నగరానికి ఏమైంది 2' చిత్రం ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమాలో కార్తీక్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు శ్రీనాథ్ మాగంటి. మొదటి భాగంలో కార్తీక్‌గా నటించిన సుశాంత్ రెడ్డికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. దీంతో రెండో భాగంలో శ్రీనాథ్ ఆ స్థాయిలో మెప్పించగలడా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కొందరైతే అప్పుడే విమర్శలు కూడా చేశారు. అయితే సినిమా విడుదలయ్యాక తన నటనతో ఆ అనుమానాలన్నింటికీ సమాధానం చెప్పాడు శ్రీనాథ్.
పెద్ద సవాలుగా మారింది
సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ వ్యాపారాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. దీంతో కార్తీక్ పాత్ర కోసం శ్రీనాథ్ ని ఎంపిక చేశారు. అయితే మొదటి భాగంతో అనుబంధం పెంచుకున్న అభిమానులను సంతృప్తి పరచడం అతడికి పెద్ద సవాలుగా మారింది. అయితే కార్తీక్ పాత్రలో సహజంగా ఒదిగిపోయి, ఆ స్నేహితుల బృందంలో ఒకడిగా ప్రేక్షకులకు కనిపించాడు. ముఖ్యంగా శివాత్మికతో అతడి ట్రాక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అదే అతిపెద్ద గుర్తింపు
సినిమా విడుదలకు ముందు తన ఎంపికపై వచ్చిన విమర్శలకు శ్రీనాథ్ తన నటనతోనే సమాధానం ఇచ్చాడు. 'నా నటనతో దర్శక, నిర్మాతలు సంతృప్తి చెందకపోతే కార్తీక్ పాత్ర కోసం మరో నటుడిని తీసుకోవాలని భావించారు. కానీ ఈ రోజు సినిమా విడుదలైంది. అందులో నేను భాగమయ్యాను. అదే నాకు దక్కిన అతిపెద్ద గుర్తింపు' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఇప్పటివరకు 'హిట్', 'యానిమల్' వంటి సినిమాల్లో సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటికి 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్ర మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
(ఇదీ చదవండి: వీళ్లలో అదొక్కటే తేడా..!’ మామా అల్లుళ్లపై మీనాక్షి కామెంట్స్)


