అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌.. ఆ స్టార్‌ హీరోనే మిస్సింగ్‌..! | Dhanush absence at Anirudh Kavya Maran wedding reception | Sakshi
Sakshi News home page

Anirudh- Kavya Maran: ‘రజనీ, విజయ్‌ వచ్చారు.. ఆ స్టార్‌ హీరో ఎక్కడ?’

Nov 22 2026 3:23 PM | Updated on Nov 22 2026 3:27 PM

Dhanush absence at Anirudh Kavya Maran wedding reception

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. నవంబర్ 21న ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

 సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ తదితరులు సందడి చేశారు. అయితే ఈ వేడుకలో కొందరు ప్రముఖ నటులు కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా అనిరుధ్‌కు తొలి అవకాశం ఇచ్చిన నటుడు ధనుష్ గైర్హాజరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విభేదాలున్నాయా?
ధనుష్, అనిరుధ్ మధ్య మంచి స్నేహం ఉండేది. ధనుష్ హీరోగా నటించిన '3' సినిమాతోనే అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'వేలై ఇల్లా పట్టదారి', 'మారి', 'తంగమగన్' వంటి సినిమాలకు కలిసి పనిచేశారు. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

 తాజాగా వివాహ రిసెప్షన్‌కు ధనుష్ రాకపోవడంతో ఈ వార్తలకు మరోసారి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో రజనీ, విజయ్‌ వచ్చారు.. ధనుష్ ఎక్కండంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.  దీనిపై ధనుష్ కానీ, అనిరుధ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. 

(ఇదీ చదవండి: రాజమౌళి కొడుకుకి మహేశ్‌బాబు మద్దతు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement