‘తండేల్’ బ్లాక్‌బస్టర్ తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. స్పర్ష్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
(ఇదీ చదవండి: రాజమౌళి కొడుకుకి మహేశ్‌బాబు మద్దతు)
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నాగచైతన్య, వెంకటేష్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘వెంకటేష్ గారు, నాగచైతన్య ఇద్దరూ కాస్త రిజర్వ్డ్‌గా ఉంటారు. అయితే నాగచైతన్య ఇంకాస్త ఎక్కువగా సైలెంట్‌గా ఉంటారు. ఇద్దరూ తమ పని తాము చేసుకుని నిశ్శబ్దంగా వెళ్లిపోతుంటారు. ఈ విషయంలో ఇద్దరిలోనూ ఒకే లక్షణం కనిపిస్తుంది. వెంకటేష్ గారు సైలెంట్‌గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సరదాగా ఉంటారు. కానీ నాగచైతన్య మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం అందరూ నాగచైతన్యలా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఎనర్జీ ఆదా అవుతుంది’ అని మీనాక్షి పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: దేవిశ్రీని చూసి షాక్‌కు గురవుతారు: బలగం డైరెక్టర్ వేణు


