‘బలగం’ చిత్రంతో ప్రేక్షకుల మరింత దగ్గరైన నటుడు, దర్శకుడు వేణు యెల్దండి. ప్రస్తుతం తన ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా షూటింగ్.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గండికోటలో మూడు రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
25 ఏళ్లుగా సంగీతంలో
అయితే ఈమూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై వేణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘ఈ సినిమాలో దేవీశ్రీ ప్రసాద్‌ని చూశాక షాక్‌కు గురవుతారు. ఆయన 25 ఏళ్లుగా సంగీతంలో ముంచేసి మ్యాజిక్ చేశారు. ఇప్పుడు నటుడిగా అతనిలో అదే మ్యాజిక్ చూస్తారు. దేవీ నటన అంత బాగుంటుంది.’ అని డైరెక్టర్ వేణు తెలిపారు.
కాగా గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టుతో హీరోగా పరిచయమవుతున్నాడు.ఇప్పటికే విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో పార్సి అనే కుర్రాడిగా కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
(ఇదీ చదవండి: రాజమౌళి కొడుకుకి మహేశ్‌బాబు మద్దతు)
దేవి గారిని చూసి షాక్ కి గురవుతారు…. 25 ఇయర్స్ నుంచి ఆయన మ్యూజిక్ లో ముంచేశారు. Actor గా కూడా అదే మ్యాజిక్ చూస్తారు. - @VenuYeldandi9 about #Yellamma https://t.co/1HnBXno3Ir
— Rajesh Manne (@rajeshmanne1) November 22, 2026


