సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
75 ఏళ్ల వయసులోనూ ఎంతో యంగ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన స్టైలిష్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు విశ్వనటుడు కమల్‌హాసన్ సంప్రదాయ పంచకట్టులో హాజరై తనదైన శైలిలో మెప్పించారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

కాగా, అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా చెన్నైలో జరిగిన రిసెప్షన్‌కు భారీ సంఖ్యలో ప్రముఖులు తరలిరావడంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

#EXCLUSIVE | காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழாவில் சூப்பர்ஸ்டார் ரஜினிகாந்த்! #SunNews | #KaviyaMaran | #Anirudh | #KaviyaAnirudhReception | @rajinikanth https://t.co/Tunb2zb7mX
— Sun News (@sunnewstamil) November 21, 2026


