హీరో ఆది సాయి కుమార్, కోలీవుడ్ నటుడు సతీష్ ప్రధాన పాత్రల్లో గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’. ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఈ నేపథ్యంలోనే ‘ఈగో రాజా’ మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సాయికుమార్ మాస్ లుక్, కామన్ మెన్‌లా సతీష్ పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. దీనిలో ఆది సాయికుమార్, సతీష్‌తో పాటుగా.. శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. మూవీ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.
(ఇదీ చదవండి: నేను ఒక్కరితోనే ప్రేమలో ఉన్నా: కీర్తి సురేశ్)


