అందుకే ఆమెకు ఫోన్‌ చేసి సారీ చెప్పా: సల్మాన్‌ ఖాన్‌ | Salman Khan Apologises to Shraddha Kapoor | Sakshi
Sakshi News home page

Salman Khan: క్షమాపణలు చెప్పిన సల్మాన్‌ ఖాన్‌..! ఏమైందంటే..?

Nov 21 2026 3:55 PM | Updated on Nov 21 2026 3:56 PM

Salman Khan Apologises to Shraddha Kapoor

బాలీవుడ్‌ స్టార్‌ హారో సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘మాతృభూమి: మే వార్‌ రెస్ట్‌ ఎన్‌ పీస్‌’ విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే తేదీకి స్టార్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ నటించిన ఈథా కూడా విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి పోటీపడనున్నాయి.

ఈ రెండు చిత్రాలనూ ఆదరించాలి
ఈ విషయంపై స్పందించిన సల్మాన్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘మొదట నవంబర్‌ 20న మా సినిమా విడుదల చేయాలనుకున్నాం. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల నవంబర్‌ 27కి మార్చుకున్నాం. 

అలా చాలా తేదీలు అలాగే మార్చుకున్నాం. డెసెంబర్‌ 24న షారుఖ్‌ ఖాన్‌ సినిమా విడుదల ఉంది. ఆయనతో ఎప్పటికీ పోటీ పడను. అందువల్ల డిసెంబర్‌ 4కి ఫిక్స్‌ అయ్యాం. తీరా చూస్తే ఆ రోజు ఈథా సినిమా రిలీజ్‌ ఉంది. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పటికే ఆమెకు కాల్‌ చేసి క్షమాపణలు చెప్పా. మాతృభూమి, ఈథా రెండు కూడా మంచి సినిమాలే. ప్రేక్షకులు ఈ రెండు చిత్రాలనూ ఆదరించాలి’ అని అన్నారు.  

(ఇదీ చదవండి: అనిరుధ్-కావ్య రిసెప్షన్.. సినీ, క్రికెట్ దిగ్గజాల సందడి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement