ఈ వారం టాలీవుడ్‌లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు తెలుగు( ఈఎన్‌ఈ రిపీట్, ఆకాశంలో ఒక తార), ఒక డబ్బింగ్ మూవీ(ఓం) ఉంది. ఈ మూడు సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలోకి వచ్చినా.. వాటి కథలు, జానర్లు, టార్గెట్ ఆడియన్స్ మాత్రం పూర్తిగా వేరు. ఒకటి యూత్‌ను టార్గెట్ చేస్తే.. మరొకటి ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంకొకటి యాక్షన్ ప్రియులను థియేటర్లకు రప్పించాలని చూస్తోంది. మరి ఇందులో ఎవరికి ఏ సినిమా నచ్చే అవకాశం ఉంది?
యూత్‌కి ‘ఈఎన్‌ఈ రిపీట్’
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈఎన్‌ఈ రిపీట్’**పై మొదటి నుంచీ యూత్‌లో మంచి ఆసక్తి ఉంది. 2018లో వచ్చిన మొదటి సినిమా యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం ఈ సీక్వెల్‌కు ప్రధాన ప్లస్. ఎనిమిదేళ్ల తర్వాత అదే గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫన్, ఫ్రెండ్‌షిప్, కామెడీ కోరుకునే యూత్ ఈ సినిమావైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు (మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి)
‘ఆకాశంలో ఒక తార’ వైపు ఫ్యామిలీ ఆడియన్స్
దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇది నచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, భార్యాభర్తల అనుబంధం, జీవితంలో కలలను సాధించాలనే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. దుల్కర్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశమే.(ఈ సినిమా రివ్యూ కోసం క్లిక్ చేయండి)
యాక్షన్ లవర్స్‌కి ‘ఓం’
ఇక ధనుష్, సాయిపల్లవి, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఓం’ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం తెలుగులో దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే థియేటర్లలో అంతగా జోరు కనిపించడం లేదు.(ఈ సినిమా రివ్యూ కోసం క్లిక్ చేయండి)
హైప్ ఉన్న చిత్రమేది?
విడుదలకు ముందు ఈ మూడు సినిమాలకూ హైప్ ఉన్నప్పటికీ.. తెలుగు ఆడియన్స్‌లో ప్రస్తుతం ‘ఈఎన్‌ఈ రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలకే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. ‘ఈఎన్‌ఈ రిపీట్’ యూత్ బేస్‌పై నమ్మకం పెట్టుకోగా.. ‘ఆకాశంలో ఒక తార’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను నమ్ముకుంది. ‘ఓం’ మాత్రం యాక్షన్ జానర్ అభిమానులపై ఆధారపడుతోంది. మొత్తానికి.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలంటే ‘ఈఎన్‌ఈ రిపీట్’.. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే ‘ఆకాశంలో ఒక తార’.. యాక్షన్ కోసం థియేటర్‌కు వెళ్లాలంటే ‘ఓం’ అన్నట్టుగా ఈ మూడు సినిమాల ఆడియన్స్ విడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి వీకెండ్ ముగిసే సరికి ఈ మూడింటిలో బాక్సాఫీస్ విజేతగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.


