విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్). 2018లో విడుదలైన‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది సీక్వెల్. అప్పట్లో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ మరోసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 19న విడుదలై మంచి స్పందన అందుకుంది.
తక్కువ చేసి మాట్లాడకండి
అయితే ఈ సినిమాపై పరోక్షంగా నెగిటివ్ రివ్యూస్ రాస్తున్న కొంతమందిపై హీరో విశ్వక్‌సేన్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదకగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘కుర్రాళ్ల టేస్ట్ గురించి.. టెస్టోస్టిరాన్ గురించి అంచనాలు వేసేంత అప్‌డేటెడ్‌గా మీరు ఉన్నారా? అన్నది నా రివ్యూ. ఒకరిని ప్రశంసించడం కోసం మరొకరిని తక్కువ చేసి మాట్లాడకండి. సంస్కారం, మంచితనం అనేవి వయసుతో పాటు పెరగాలి కానీ తరగకూడదు’ అంటూ విశ్వక్ సేన్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: సమంత కొడుకు పేరుకు అర్థం ఇదే..!)
@sairaaj44 Kurralla gurinchi valla taste gurinchi , testosterone gurinchi anchanalu vese antha updated meeru unnara? Ani na review . Praise one , don’t degrade other one . Samskaram , manchithanam anevi vayasu tho pergali, tharagodhu
— VishwakSen (@VishwakSenActor) November 20, 2026


