ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న 'జబర్దస్త్' కమెడియన్ | Jabardasth Babu Marriage With Amulya | Sakshi
Sakshi News home page

Jabardasth Babu: కమెడియన్ నుంచి దర్శకుడిగా.. ఇప్పుడు పెళ్లి

Nov 20 2026 7:08 PM | Updated on Nov 20 2026 7:16 PM

Jabardasth Babu Marriage With Amulya

జబర్దస్త్ షోతో చాలామంది కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లలో బాబు ఒకడు. హైపర్ ఆది స్కిట్లలో ప్రధానంగా కనిపించిన ఇతడు..ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. దాదాపు ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమూల్య అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు. శుక్రవారం ఈ వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని బాబుతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి నేరుగా నివేదా కొత్త సినిమా స్ట్రీమింగ్)

ఓ సాధారణ కమెడియన్‌గానే కెరీర్ మొదలుపెట్టిన డేగల బాబు.. తర్వాత కాలంలో రైటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అలా మూడేళ్ల క్రితం 'ప్రేమ్ వాలంటీర్' అని యూట్యూబ్ సిరీస్ తీశాడు. రీసెంట్ టైంలో కమెడియన్ హర్ష ప్రధాన పాత్రలో 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. ఓ సెట్ ఆఫ్ ప్రేక్షకుల్ని ఇది బాగానే నవ్వించింది.

అలా దర్శకుడిగా సక్సెస్ అందుకునే బాబు శుభవార్త చెప్పేశాడు. తన ప్రియురాలు అమూల్యతో కొత్త జీవితం ప్రారంభించాడు. దీంతో తోటి కమెడియన్స్ నూతన వధూవరులకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: సమంతకు బిడ్డ.. 12 ఏళ్ల క్రితం జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement