సమంతకు బిడ్డ.. 12 ఏళ్ల క్రితం చెప్పిందే నిజమైంది | Samantha Ruth Prabhu Welcomes Baby Boy With Raj Nidimoru, Astrologer 12 Year Old Prediction Comes True, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Samantha Baby Boy: సమంతకు కొడుకు పుట్టాడు.. అదే నిజమైంది

Nov 20 2026 4:08 PM | Updated on Nov 20 2026 4:44 PM

Actress Samantha Baby Boy And Named Dev

హీరోయిన్ సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది డిసెంబరులో రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సామ్.. ఏడాది తిరిగేసరికల్లా తల్లయిపోయింది. తన కొడుకు పట్టుకుని ఉన్న ఫొటోని సమంత షేర్ చేసింది. నవంబర్ 19న ప్రసవం జరిగినట్లు సామ్ వెల్లడించింది. అయితే ఈమెకు మగబిడ్డే పుడతాడని గతంలో ఓ జ్యోతిషుడు చెప్పాడు. ఇప్పుడు అదే నిజమైంది.

(ఇదీ చదవండి: ధనుష్‌ ‘ఓం’ మూవీ రివ్యూ )

స్వతహాగా తమిళ అమ్మాయి అయిన సమంత.. 'ఏ మాయ చేశావె' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇలా దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి పనిచేసింది. కెరీర్ ప్రారంభంలో అంటే 2014 టైంలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' టాక్ షోకి వెళ్లింది.

ఇందులోనే ఓ సాముద్రికుడు(ముఖం చూసి జాతకం చెప్పే వ్యక్తి) సమంతని చూసి ఈమెకు తొలి సంతానం మగబిడ్డే పుడతాడని చెప్పాడు. కానీ అప్పుడు సామ్ మాత్రం తనకు ఆడపిల్లే కావాలని చెప్పింది. కానీ సదరు జ్యోతిషుడు చెప్పినట్లే సామ్‌కి తొలుత మగబిడ్డే పుట్టాడు. అతడికి దేవ్ అని పేరు కూడా పెట్టేశారు.

సమంత వ్యక్తిగత విషయానికొస్తే.. కలిసి నటించిన హీరో నాగచైతన్యని 2017లో పెళ్లి చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాలతో 2021లో వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉన్న సామ్.. దాదాపు నాలుగేళ్ల తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ కోసం సామ్-రాజ్ కలిసి పనిచేశారు. అలా మొదలైన స్నేహం, ప్రేమగా మారి వివాహ బంధం వరకు వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అయిపోయారు. ఈ ఏడాది 'మా ఇంటి బంగారం'తో సమంత బ్లాక్‌బస్టర్ హిట్ కూడా కొట్టడం విశేషం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి నేరుగా నివేదా కొత్త సినిమా స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement