ఈ రోజే హీరోయిన్‌గా డెబ్యూ.. అల్లు అరవింద్‌ గోల్డెన్‌ ఆఫర్‌ | Satvika veeravalli Next Movies List | Sakshi
Sakshi News home page

Satvika Veeravalli: సాత్వికకు అల్లు అరవింద్‌ గోల్డెన్‌ ఆఫర్‌

Nov 20 2026 2:33 PM | Updated on Nov 20 2026 2:37 PM

Satvika veeravalli Next Movies List

సినిమా రంగంలో తొలి అడుగే విజయవంతమైతే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేది జగమెరుగని సత్యం. కానీ మొదటి సినిమా ఫలితం కోసం ఎదురుచూడకుండానే వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకోవడం మాత్రం అరుదు. ఇప్పుడు ఇదే విషయంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది యంగ్ హీరోయిన్ సాత్వికా వీరవల్లి.

దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన తొలి చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అప్పుడే అక్కినేని హీరో నాగచైతన్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించడంతో సాత్విక పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది.

నాగచైతన్య హీరోగా..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అల్లు అరవింద్ సాత్విక గురించి  మాట్లాడుతూ.. ‘సినిమా ఎడిటింగ్ సమయంలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయా. కొత్త హీరోయిన్ అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటిలా అద్భుతంగా నటించింది. దీంతో గీతా ఆర్ట్స్ సంస్థలో త్వరలో నాగచైతన్య హీరోగా చిత్రానికి అప్పుడే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నా’ అని వెల్లడించారు.  దీంతో పక్కనే ఉన్న దుల్కర్ సల్మాన్ సైతం ఆశ్చర్యపోయి సాత్వికకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్?
మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న ‘ఆర్సీ 17’ సినిమాలోనూ సాత్విక హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఒకవైపు తొలి సినిమా విడుదలవుతుండగానే నాగచైతన్య సినిమాలో అవకాశం దక్కించుకోవడం.. మరోవైపు రామ్ చరణ్ సినిమా గురించి వార్తలు వినిపిస్తుండటంతో ఈ యంగ్ బ్యూటీ పేరు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మరి తొలి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించే సాత్విక.. రాబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement