పాయల్ చెంగప్ప, దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మయూఖ’. ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్కే((శ్రీకాంత్ కండ్రాగుల)) దర్శకత్వం వహించగా.. శశిధర్ నల్ల నిర్మించారు. సస్పెన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 9న విడుదలై మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
నవంబర్ 20 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే నవంబర్ 23 నుంచి తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ వెర్షన్లలో అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్లలో స్ట్రీమింగ్ కానుంది.
కథేంటంటే..
మయూఖ (పాయల్ చెంగప్ప) సింగిల్ గా ఉంటూ ఒక బ్యాంకు లో పని చేస్తుంది. ఆమెకు కొంచెం భయం ఎక్కువ. తను ఉండే ఫ్లాట్ లోకి ఒక అపరిచ వ్యక్తి వచ్చి వెళ్తుంటాడు. తనను ఎవరో ఫాలో అవుతున్నారు అని...గదిలోకి వచ్చి వెళ్తున్నారని పోలీసులకి చెప్తే నమ్మరు. ఆధారాలు అడుగుతుంటారు. అదే సమయంలో సిటీలో వరుస హత్యలు జరుగుతుంటాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాచ్ మెన్ నుంచి ఓనర్ వరకు ప్రతి ఒక్కరిని మయూఖ అనుమానస్తుంది.
సీసీ కెమెరాలను పరిశీలిస్తే..తన సహోద్యోగి వచ్చివెళ్లినట్లుగా తెలుస్తుంది. అదే రోజు అతని మయూఖ దగ్గరకు వస్తాడు. గది ముందు నిలబడి కాలింగ్ బెల్ కొట్టగానే..భయంతో డోర్ ఓపెన్ చేస్తుంది. అతను ఇంట్లోకి రాగానే డోర్ లాక్ చేసి పోలీసులకు ఫోన్ చేస్తుంది. వాళ్లు వచ్చి చూసేసరికి అతను చనిపోతాడు. దీంతో మయుఖను పోలీసులు అరెస్ట్ చేస్తారు. విచారణలో ఆమె హత్య చేయలేదని తేలుతుంది. మరి ఆ హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? మయుఖను భయపెడుతున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? నిజంగానే ఆమె గదిలో మరో వ్యక్తి ఉన్నాడా లేడా? చివరకు పోలీసులు ఈ కేసును ఎలా చేధించారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
(ఇదీ చదవండి: 'ఆకాశంలో ఒక తార' మూవీ రివ్యూ)



