టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
పాయల్ చెంగప్ప, దేవ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ మయూఖ. ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్కే((శ్రీకాంత్ కండ్రాగుల)) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన మయూఖ ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ కథ మొత్తం మిస్టరీ హత్యల చుట్టు తిరిగే కోణంలో ఉన్నట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. ఈ మూవీ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందించారు. ట్రైలర్లో హారర్ సీన్స్ ఆడియన్స్లో ఆసక్తి మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బారా, అమన్ మసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మాథ్యూ అలెక్స్ సంగీతమందిస్తున్నారు.